ఓటీటీకి మరో సినిమా రెడీ

థియేటర్లు ఇప్పట్లో తెరుచుకునేలా లేవు. తెరిచి పెట్టినా జనాలు వస్తారనే గ్యారెంటీ లేదు. అయినా తెగించి రిలీజ్ చేద్దామంటే చిన్న సినిమాలకు సందు దొరికే పరిస్థితి కనిపించడం లేదు. అందుకే చిన్న సినిమాలన్నీ ఒక్కొక్కటిగా ఓటీటీ బాట పడుతున్నాయి. ఇప్పటికే కొన్ని సినిమాలు అగ్రిమెంట్స్ కుదుర్చుకోగా.. మరికొన్ని శరవేగంగా ఓటీటీ వైపు అడుగులు వేస్తున్నాయి. ఈ లిస్ట్ లో తాజాగా చేరిన సినిమా ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’.

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన సినిమా ఇది. వర్ష బొల్లమ హీరోయిన్ గా నటించింది. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై లో-బడ్జెట్ లో తెరకెక్కిన ఈ సినిమా లాక్ డౌన్ ముందే షూటింగ్ పూర్తిచేసుకుంది. ఇప్పుడీ సినిమాను ఓటీటీకి ఇచ్చే ఆలోచన చేస్తున్నారు మేకర్స్.

మొన్నటివరకు థియేట్రికల్ రిలీజ్ కోసం ఈ సినిమా దాచిపెట్టారు. పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో మెల్లమెల్లగా సినిమా ప్రచారం మొదలుపెట్టారు. ఈమధ్యే టైటిల్ ఎనౌన్స్ చేశారు. రేపట్నుంచి సాంగ్స్ కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఓ మంచి ముహూర్తాన సినిమాను ఓటీటీకి ఇచ్చేసే ప్రణాళికలో ఉన్నారు.