Telugu Global
National

రాయలసీమ ఎత్తిపోతలకు గ్రీన్ సిగ్నల్

ఏపీ ప్రభుత్వం చేపడుతున్న రాయలసీమ ఎత్తిపోతల పథకంపై గ్రీన్ ట్రిబ్యునల్ తన గత ఉత్తర్వులను సవరించింది. ఎత్తిపోతల పథకానికి సంబంధించిన టెండర్ల రూపకల్పన, టెండర్ల ఆహ్వానం, డీపీఆర్‌ల తయారీ, ఇతర పరిపాలన పరమైన పనులన్నీ చేసుకోవచ్చని ఉత్తర్వులు ఇచ్చింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం కోసం ఏపీ ప్రభుత్వం జీవో ఇవ్వగానే తెలంగాణలోని నారాయణపేట జిల్లాకు చెందిన శ్రీనివాస్‌ అనే వ్యక్తి గ్రీన్‌ ట్రిబ్యునల్‌లో పిటిషన్ వేశారు. పర్యావరణ అనుమతులు లేకుండానే ఎత్తిపోతల పథకం చేపడుతున్నారని పిటిషనర్ ఆరోపించారు. […]

రాయలసీమ ఎత్తిపోతలకు గ్రీన్ సిగ్నల్
X

ఏపీ ప్రభుత్వం చేపడుతున్న రాయలసీమ ఎత్తిపోతల పథకంపై గ్రీన్ ట్రిబ్యునల్ తన గత ఉత్తర్వులను సవరించింది. ఎత్తిపోతల పథకానికి సంబంధించిన టెండర్ల రూపకల్పన, టెండర్ల ఆహ్వానం, డీపీఆర్‌ల తయారీ, ఇతర పరిపాలన పరమైన పనులన్నీ చేసుకోవచ్చని ఉత్తర్వులు ఇచ్చింది.

రాయలసీమ ఎత్తిపోతల పథకం కోసం ఏపీ ప్రభుత్వం జీవో ఇవ్వగానే తెలంగాణలోని నారాయణపేట జిల్లాకు చెందిన శ్రీనివాస్‌ అనే వ్యక్తి గ్రీన్‌ ట్రిబ్యునల్‌లో పిటిషన్ వేశారు. పర్యావరణ అనుమతులు లేకుండానే ఎత్తిపోతల పథకం చేపడుతున్నారని పిటిషనర్ ఆరోపించారు. ఆ పిటిషన్‌ను విచారించిన చెన్నైలోని ఎన్‌జీటీ బెంచ్‌… మే 20న రాయలసీమ ఎత్తిపోతల పథకంపై స్టే ఇచ్చింది.

స్టేను ఎత్తివేయాలని ప్రభుత్వం ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం కొత్తది కాదని… 2015లో తెలుగు రాష్ట్రాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం చేపడుతున్న అనుబంధ పథకమేనని ఏపీ ప్రభుత్వం వివరించింది. ఇది ఎత్తిపోతల పథకమేనని… దీనికి పర్యావరణ అనుమతులు కూడా అవసరం లేదని వాదించింది. ఏపీ వాదనతో ఏకీభవించిన ట్రిబ్యునల్… మే 20న ఇచ్చిన ఉత్తర్వులను సవరించింది.

క్షేత్రస్థాయిలో పనులు మాత్రం తమ తుది ఆదేశాలు వెలువడిన తర్వాతే చేపట్టాలని ఆదేశించింది. ఈ పథకానికి పర్యావరణ అనుమతులు అవసరమా కాదా అన్న దానిపై కేంద్ర పర్యావరణ శాఖ స్పష్టత ఇవ్వాలని ఆదేశించింది.

First Published:  13 July 2020 10:48 PM GMT
Next Story