రాజమౌళి హైదరాబాద్ లో లేడా!

“ఆర్ఆర్ఆర్”ను పట్టాలపైకి తీసుకురావడానికి చాలా ప్రయత్నించాడు రాజమౌళి. యూనిట్ సైజ్ ను బాగా తగ్గించాడు. తీయాల్సిన సన్నివేశాల ఆర్డర్ ను కూడా మార్చాడు. టెస్ట్ షూట్ చేసిన తర్వాత నిర్ణయం తీసుకోవాలనుకున్నాడు. కానీ కరోనా వల్ల రాజమౌళి ప్లాన్స్ ఏవీ వర్కవుట్ కాలేదు. మరీ ముఖ్యంగా ఇప్పటికిప్పుడు సెట్స్ పైకి రావడం కుదరదని ఎన్టీఆర్, తారక్ తెగేసి చెప్పినట్టు తెలుస్తోంది.

దీంతో రాజమౌళి హైదరాబాద్ ను విడిచి తన ఫామ్ హౌజ్ కు చేరుకున్నాడు. ఇప్పటికిప్పుడు “ఆర్ఆర్ఆర్”కు సంబంధించి చేయాల్సిన పనులేవీ లేకపోవడంతో రాజమౌళి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. నల్గొండ జిల్లా నార్కట్ పల్లికి సమీపంలో ఉన్న ఎదులూరు గ్రామం వద్ద రాజమౌళికి పెద్ద ఫామ్ హౌజ్ ఉంది.

ఎప్పటికప్పుడు తన కుటుంబంతో కలిసి ఆ ఫామ్ హౌజ్ కు వెళ్లి వస్తుంటాడు జక్కన్న. అయితే ఈసారి ఎక్కువ రోజులు ఫామ్ హౌజ్ లోనే ఉండేలా ప్లాన్ చేసి మరీ వెళ్లాడట ఈ దర్శకుడు. హైదరాబాద్ లో కరోనా కేసులు రోజురోజుకు పెరగడం కూడా రాజమౌళి ఈ నిర్ణయం తీసుకోవడానికి ఓ కారణంగా చెబుతున్నారు.