Telugu Global
Cinema & Entertainment

హిందీలోకి "హిట్"

తెలుగులో ఈమధ్య కాలంలో వచ్చిన సక్సెస్ ఫుల్ సినిమాల్లో “హిట్” ఒకటి. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఈ సినిమాతో నిర్మాతగా నాని మంచి లాభాలే కళ్లజూశాడు. ఇప్పుడీ సినిమా బాలీవుడ్ బాట పట్టింది. హిట్ సినిమాను హిందీలో రీమేక్ చేయబోతున్నాడు నిర్మాత దిల్ రాజు. ఇప్పటికే నాని నుంచి హిందీ రీమేక్ రైట్స్ తీసుకున్న ఈ నిర్మాత.. రాజ్ కుమార్ రావు హీరోగా హిట్ హిందీ రీమేక్ ను అధికారికంగా ప్రకటించాడు. సెప్టెంబర్ రెండో వారం […]

హిందీలోకి హిట్
X

తెలుగులో ఈమధ్య కాలంలో వచ్చిన సక్సెస్ ఫుల్ సినిమాల్లో “హిట్” ఒకటి. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఈ సినిమాతో నిర్మాతగా నాని మంచి లాభాలే కళ్లజూశాడు. ఇప్పుడీ సినిమా బాలీవుడ్ బాట పట్టింది. హిట్ సినిమాను హిందీలో రీమేక్ చేయబోతున్నాడు నిర్మాత దిల్ రాజు.

ఇప్పటికే నాని నుంచి హిందీ రీమేక్ రైట్స్ తీసుకున్న ఈ నిర్మాత.. రాజ్ కుమార్ రావు హీరోగా హిట్ హిందీ రీమేక్ ను అధికారికంగా ప్రకటించాడు. సెప్టెంబర్ రెండో వారం నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వస్తుందని కూడా ప్రకటించాడు.

హిట్ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు శైలేష్ కొలను. ఇతడే హిందీ వెర్షన్ ను కూడా డైరక్ట్ చేయబోతున్నాడు. బాలీవుడ్ స్టయిల్ కు తగ్గట్టు ప్రాజెక్టుకు మార్పులు చేర్పులు కూడా చేసి సిద్ధంగా ఉన్నాడు. హీరోయిన్ ఎవరనేది ఫిక్స్ అయిన వెంటనే టెక్నికల్ టీమ్ ను ఫైనలైజ్ చేస్తారు.

First Published:  15 July 2020 8:26 AM GMT
Next Story