Telugu Global
National

'దిశ' కేసులో ఏం చేశామో... దుబే కేసులో అదే చేస్తాం " సుప్రీంకోర్టు

ఉత్తరప్రదేశ్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబే ఎన్‌కౌంటర్ కేసుపై సుప్రీంకోర్టులో ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైన సంగతి తెలిసిందే. దీనిపై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణలో ‘దిశ’ కేసుకు సంబంధించిన ఎన్‌కౌంటర్‌ను ఉదహరించింది. వెటర్నరీ డాక్టర్ దిశను నలుగురు వ్యక్తులు అత్యంత దారుణంగా మానభంగం చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పోలీసులు ఆ నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేసే సమయంలో నిందితులు పారిపోతుండగా పోలీసులు […]

దిశ కేసులో ఏం చేశామో... దుబే కేసులో అదే చేస్తాం  సుప్రీంకోర్టు
X

ఉత్తరప్రదేశ్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబే ఎన్‌కౌంటర్ కేసుపై సుప్రీంకోర్టులో ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైన సంగతి తెలిసిందే. దీనిపై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణలో ‘దిశ’ కేసుకు సంబంధించిన ఎన్‌కౌంటర్‌ను ఉదహరించింది.

వెటర్నరీ డాక్టర్ దిశను నలుగురు వ్యక్తులు అత్యంత దారుణంగా మానభంగం చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పోలీసులు ఆ నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేసే సమయంలో నిందితులు పారిపోతుండగా పోలీసులు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరపగా చనిపోయినట్లు కోర్టకు చెప్పారు.

ఆనాడే సుప్రీంకోర్టులో దిశ ముద్దాయిల ఎన్‌కౌంటర్ కేసులో రిటైర్డ్ న్యాయమూర్తి విష్ సిర్పూర్కర్ నేతృత్వంలో కమిటీ వేశామని.. కమిటీ విచారణ పూర్తయినా కరోనా కారణంగా ఇంత వరకు నివేదిక రాలేదని చెప్పింది. ఇప్పుడు వికాస్ దుబే ఎన్‌కౌంటర్ విషయంలో కమిటీ వేయాలని భావిస్తున్నామని.. అయితే ఎలాంటి కమిటి వేయాలో గురువారం లోగా ధర్మాసనానికి తెలియజేయాలని సీజేఏ బాబ్డే తెలిపారు. కేసు విచారణను ఈ నెల 20కి వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.

First Published:  14 July 2020 10:45 PM GMT
Next Story