Telugu Global
National

బీమా కోరేగావ్ కేసులో అరెస్ట్ అయిన గౌతమ్ నవ్‌లఖా, ఆనంద్ తెల్తుంబ్డే‌కు ప్రతిష్టాత్మక అవార్డు

బీమా కోరేగావ్ కేసులో అరెస్ట్ అయిన, ప్రస్తుతం జైల్లో ఉన్న హక్కుల కార్యకర్తలు గౌతమ్ నవ్‌లఖా, ఆనంద్ తెల్తుంబ్డేలకు ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. వారి సంబంధిత రంగాలకు సంబంధించిన రచనలకు గుర్తింపుగా 2020 శక్తి భట్ బుక్ ప్రైజ్ లభించింది. తెల్తుంబ్డే ఇప్పటి వరకు ఇరవైకి పైగా పుస్తకాలు రచించారు. రిపబ్లిక్ ఆఫ్ కాస్ట్ అండ్ రాడికల్ ఇన్ అంబేత్కర్, దళిత్స్ – పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ అనేవి కూడా ఆయన రచించినవే. ఇక గౌతమ్ నవ్‌లఖా […]

బీమా కోరేగావ్ కేసులో అరెస్ట్ అయిన గౌతమ్ నవ్‌లఖా, ఆనంద్ తెల్తుంబ్డే‌కు ప్రతిష్టాత్మక అవార్డు
X

బీమా కోరేగావ్ కేసులో అరెస్ట్ అయిన, ప్రస్తుతం జైల్లో ఉన్న హక్కుల కార్యకర్తలు గౌతమ్ నవ్‌లఖా, ఆనంద్ తెల్తుంబ్డేలకు ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. వారి సంబంధిత రంగాలకు సంబంధించిన రచనలకు గుర్తింపుగా 2020 శక్తి భట్ బుక్ ప్రైజ్ లభించింది.

తెల్తుంబ్డే ఇప్పటి వరకు ఇరవైకి పైగా పుస్తకాలు రచించారు. రిపబ్లిక్ ఆఫ్ కాస్ట్ అండ్ రాడికల్ ఇన్ అంబేత్కర్, దళిత్స్ – పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ అనేవి కూడా ఆయన రచించినవే. ఇక గౌతమ్ నవ్‌లఖా డే అండ్ నైట్స్ ఇన్ ద హార్ట్‌ల్యాండ్ ఆఫ్ రెబెలియన్, ఏన్ అకౌంట్ ఆఫ్ మావోయిజమ్ ఇండియా, ఫ్రమ్ చత్తీస్‌గర్స్ బస్తర్ డిస్ట్రిక్ అనే పుస్తకాలు రచించారు. తెల్తుంబ్డే ప్రస్తుతం జైల్లో ఉన్న కారణంగా ఆయన భార్య రమా తెల్తుంబ్డేకు ఈ ఆవార్డు అందిస్తామని శక్తి భట్ ఫౌండేషన్ తెలిపింది.

పూణే నగరం సమీపంలోని బీమా కోరేగావ్ ప్రాంతంలో జరిగిన అల్లర్లకు వీరికి సంబంధం ఉందని పలు సెక్షన్ల కింద వీరిద్దరితో పాటు 11 మందిపై 2018లో కేసు నమోదైంది. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఉపా కేసు కూడా నమోదు చేశారు. ఎల్గార్ పరిషత్ జరిగిన మరుసటి రోజే ఈ అల్లర్లు జరగడంతో పూణే పోలీసులు వీరిపై కేసు నమోదు చేశారు. వీరిద్దరిని ఈ ఏడాది ఏప్రిల్ 14న ఎన్ఐఏ అరెస్టు చేసింది. ఇదే కేసులో గతంలోనే హక్కుల కార్యకర్తలు సుధా భరద్వాజ్, అరున్ ఫెరీరా, వెర్నోన్ గున్జాల్వేస్, విరసం కవి వరవరరావు అరెస్టయ్యారు.

కాగా, గత 12 ఏండ్లుగా సాహిత్యంలో శక్తి భట్ అవార్డు ప్రకటిస్తున్నారు. దక్షిణాసియా ప్రాంతంలోని శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇండియా దేశాలకు చెందిన రచయితలకు ఈ అవార్డు అందజేస్తున్నారు. ఈ అవార్డు ద్వారా రూ. 2 లక్షల నగదు ఒక ట్రోఫీ బహుకరిస్తారు.

First Published:  16 July 2020 2:23 AM GMT
Next Story