త్వరలోనే డేట్ చెప్పబోతున్నారా?

ప్రభాస్ మూవీకి సంబంధించి ఇప్పటికే టైటిల్ ఎనౌన్స్ చేశారు. పనిలోపనిగా ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. ఇక మిగిలింది రిలీజ్ డేట్ ఒక్కటే. ఆ పని కూడా త్వరలోనే చేయబోతున్నారు. అవును.. రాధేశ్యామ్ సినిమాకు సంబంధించి మరికొన్ని రోజుల్లో రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా ఎనౌన్స్ చేయబోతున్నారు. తేదీ చెప్పకపోయినా కనీసం ఏ నెలలో రిలీజ్ చేస్తారనే విషయాన్ని బయటపెట్టే అవకాశం ఉంది.

ఈ మూవీకి సంబంధించి 15 కోట్ల రూపాయల ఖర్చుతో యూరోప్ ను తలపించేలా భారీ సెట్స్ వేశారు. ఆ సెట్స్ రెడీ అయ్యాయి. వచ్చే నెల నుంచి అందులో షూటింగ్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు. దీంతో మూవీని ఎప్పుడు రిలీజ్ చేయాలనే అంశంపై మేకర్స్ కు ఓ అవగాహన వస్తుంది.

అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే ఏడాది ఏప్రిల్ లో సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని అనుకుంటున్నారు. సినిమాకు సంబంధించి ఇప్పటికే 50శాతానికి పైగా షూటింగ్ పూర్తయింది. మిగతా భాగాన్ని ఈ గ్యాప్ లో పూర్తిచేసి, సమ్మర్ ఎట్రాక్షన్ గా మూవీని తీసుకురాబోతున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమాకు రాథాకృష్ణ కుమార్ దర్శకుడు.