కొరియోగ్రాఫర్ గా మారిన హీరోయిన్

కేవలం నటి మాత్రమే కాదు, సాయిపల్లవి మంచి డాన్సర్ అనే విషయం అందరికీ తెలిసిందే. ఫిదా సినిమాలో ఆమె డాన్స్ కు ఫిదా అవ్వని ప్రేక్షకుడు లేడు. సినిమాల్లోకి రాకముందే ఆమె ఎన్నో డాన్స్ షోల్లో పాల్గొంది. అవార్డులు కూడా గెలుచుకుంది. సాయిపల్లవికి ఇప్పుడు మరోసారి తన డాన్సింగ్ టాలెంట్ చూపించే అవకాశం వచ్చింది.

నాగచైతన్య హీరోగా సాయిపల్లవి హీరోయిన్ గా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ఓ పాటకు డాన్స్ కంపోజ్ చేయబోతోంది సాయిపల్లవి. ఈ పాటకు కొరియోగ్రఫీ చేయమని స్వయంగా శేఖర్ కమ్ముల కోరడంతో ఇలా తన డాన్సింగ్ టాలెంట్ ను బయటపెట్టబోతోంది.

పాటకు సంబంధించి ఇప్పటికే కొరియోగ్రఫీ వర్క్ అంతా పూర్తిచేసింది సాయిపల్లవి. వచ్చే నెలలో రామోజీ ఫిలింసిటీలో వేసిన సెట్ లో ఈ సాంగ్ షూటింగ్ ఉంటుంది. 3 రోజుల్లో ఈ పాటను పూర్తిచేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. సో.. సాయిపల్లవి ఈసారి తన పాటకు తానే స్టెప్పులు సమకూర్చుకుందన్నమాట. ఒకప్పుడు నటి భానుమతి ఇలా చేశారు. మళ్లీ ఇన్నాళ్లకు సాయిపల్లవి.