సర్కారు వారి పాట…. తొందర లేదంటున్న మహేష్

మహేష్ మూవీకి సంబంధించి అన్ని పనులు ఆపేశారు. మొన్నటివరకు ప్రీ-ప్రొడక్షన్ పనులు జోరుగా నడిచాయి. హీరోయిన్, విలన్ ల ఎంపిక స్టార్ట్ అయినట్టు స్వయంగా దర్శకుడు ప్రకటించాడు. అయితే ఇప్పుడు నటీనటుల ఎంపికతో పాటు మిగతా అన్ని పనుల్ని ఎక్కడికక్కడ ఆపేశారు. దీనికి ఓ కారణం ఉంది.

మహేష్-పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమాను అఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు. లాక్ డౌన్ వల్ల కాస్త ఆలస్యమైనప్పటికీ ఏ క్షణానైనా సినిమా సెట్స్ పైకి రావొచ్చని అంతా అనుకున్నారు. దర్శకుడు కూడా అలానే భావించి అన్ని పనులు ముమ్మరం చేశాడు. అయితే మహేష్ ఇప్పట్లో సెట్స్ పైకి రానని చెప్పేశాడట.

ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ఈ సినిమా మొదలయ్యే అవకాశం ఉంది. ఈలోగా హీరోయిన్, విలన్ లను ఎంపిక చేసి వాళ్లకు అడ్వాన్స్ ఇచ్చి, తర్వాత కాల్షీట్ల కోసం కిందామీద పడే బదులు.. ఆ టైమ్ కు అందుబాటులో ఉన్న నటీనటుల్ని తీసుకుంటే బెటర్ అనే ఆలోచనతో అన్ని పనులు పక్కనపడేశారు.