Telugu Global
Cinema & Entertainment

ఒకే రోజు పవన్ రెండు అప్ డేట్స్...

ఈసారి పవన్ ఫ్యాన్స్ కు పండగే. పవర్ స్టార్ నుంచి ఒకే రోజు రెండు అప్ డేట్స్ రాబోతున్నాయి. ఆ ముహూర్తం కూడా ఫిక్స్ అయింది. అదే సెప్టెంబర్ 2. ఎందుకంటే ఆరోజు పవన్ కల్యాణ్ పుట్టినరోజు. ముందుగా వకీల్ సాబ్ నుంచి బహుమతి రాబోతోంది. పవన్ రీఎంట్రీ సినిమాగా ఇప్పటికే ఎనలేని గుర్తింపు తెచ్చుకున్న ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజైంది. ఓ సింగిల్ కూడా విడుదల చేశారు. ఇప్పుడు టీజర్ […]

ఒకే రోజు పవన్ రెండు అప్ డేట్స్...
X

ఈసారి పవన్ ఫ్యాన్స్ కు పండగే. పవర్ స్టార్ నుంచి ఒకే రోజు రెండు అప్ డేట్స్ రాబోతున్నాయి. ఆ ముహూర్తం కూడా ఫిక్స్ అయింది. అదే సెప్టెంబర్ 2. ఎందుకంటే ఆరోజు పవన్ కల్యాణ్ పుట్టినరోజు.

ముందుగా వకీల్ సాబ్ నుంచి బహుమతి రాబోతోంది. పవన్ రీఎంట్రీ సినిమాగా ఇప్పటికే ఎనలేని గుర్తింపు తెచ్చుకున్న ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజైంది. ఓ సింగిల్ కూడా విడుదల చేశారు. ఇప్పుడు టీజర్ రిలీజ్ చేయబోతున్నారు. పవన్ పుట్టినరోజుకు ఒక రోజు ముందు వకీల్ సాబ్ టీజర్ రిలీజ్ చేయబోతున్నట్టు దిల్ రాజ్ అన్-అఫీషియల్ గా ప్రకటించేశాడు.

ఇక పవన్ పుట్టినరోజు నాడు మరో మూవీ హంగామా ఉంటుంది. అదే క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా. ఈ సినిమా టైటిల్ ను పవన్ పుట్టినరోజున గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. ఈ మూవీకి విరూపాక్షి, బందిపోటు, మంచి దొంగ, చోర అనే టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. వీటిలో ఏ టైటిల్ ఫిక్స్ అవుతుందో చూడాలి.

First Published:  17 July 2020 11:00 AM GMT
Next Story