బిగ్ బాస్ హీరోలు వీళ్లేనా?

బిగ్ బాస్ సీజన్-4 హంగామా మొదలైపోయింది. స్టార్ మా ఛానెల్ నుంచి అధికారికంగా ప్రకటన రానప్పటికీ.. తెరవెనక నటీనటుల్ని సంప్రదించే కార్యక్రమం మొదలైంది. ఈ క్రమంలో ఇప్పటికే చాలామంది హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. వాళ్లలో కొందరు బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంటరవ్వడానికి ఒప్పుకున్నట్టు కూడా వార్తలొచ్చాయి. ఇప్పుడు హీరోల వంతు వచ్చింది.

ప్రస్తుతం బిగ్ బాస్ నిర్వహకులు కొంతమంది హీరోలతో టచ్ లోకి వెళ్లారు. హౌజ్ కు మరింత కలర్, క్రేజ్ తీసుకురావడం కోసం సినీ హీరోలైతే బాగుంటుందనే ఉద్దేశంతో ఈసారి ఈ దిశగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే హీరోలు కార్తికేయ, సిద్ధూ జొన్నలగడ్డను సంప్రదించినట్టు తెలుస్తోంది. అయితే దానికి వాళ్లు నిరాకరించినట్టు కూడా వార్తలు వస్తున్నాయి.

అయితే హౌజ్ లోకి వెళ్లడానికి మరో ఇద్దరు హీరోలు మాత్రం ఆసక్తి కనబరిచినట్టు కథనాలు వస్తున్నాయి. ఈ లిస్ట్ లో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫేమ్ సుధాకర్, గరుడవేగ సినిమాలో నటించిన అదిత్ అరుణ్ పేర్లు వినిపిస్తున్నాయి. త్వరలోనే వీటిపై స్టార్ మా యాజమాన్యం నుంచి ఓ క్లారిటీ రాబోతోంది.