Telugu Global
International

కరోనా వైరస్ సూపర్ స్ప్రెడర్ ఎవరంటే...

ఒకరినుండి ఒకరికి చాలా వేగంగా వ్యాపించే వైరస్ కోవిడ్ 19… ఇది మనందరికీ తెలుసు. అయితే మరింత వేగంగా దీనిని ఇతరులకు వ్యాపింప చేసేవారిని సూపర్ స్ప్రెడర్ గా భావించవచ్చు. అలాంటి లక్షణాలు  కొంతమందిలో మరింత ప్రత్యేకంగా ఉంటాయట. ఉదాహరణకు ఎ, బి అనే ఇద్దరు వ్యక్తులకు కరోనా సోకి…. ఇద్దరిలోనూ లక్షణాలు కనిపించడం లేదనుకోండి… ఏకకాలంలో ‘ఎ’ నుండి పదిమందికి వ్యాధి సోకగా ‘బి’ నుండి ఇద్దరు మాత్రమే ఇన్ ఫెక్షన్ కి గురయితే…’ఎ’ ని […]

కరోనా వైరస్ సూపర్ స్ప్రెడర్ ఎవరంటే...
X

ఒకరినుండి ఒకరికి చాలా వేగంగా వ్యాపించే వైరస్ కోవిడ్ 19… ఇది మనందరికీ తెలుసు. అయితే మరింత వేగంగా దీనిని ఇతరులకు వ్యాపింప చేసేవారిని సూపర్ స్ప్రెడర్ గా భావించవచ్చు. అలాంటి లక్షణాలు కొంతమందిలో మరింత ప్రత్యేకంగా ఉంటాయట.

ఉదాహరణకు ఎ, బి అనే ఇద్దరు వ్యక్తులకు కరోనా సోకి…. ఇద్దరిలోనూ లక్షణాలు కనిపించడం లేదనుకోండి… ఏకకాలంలో ‘ఎ’ నుండి పదిమందికి వ్యాధి సోకగా ‘బి’ నుండి ఇద్దరు మాత్రమే ఇన్ ఫెక్షన్ కి గురయితే…’ఎ’ ని సూపర్ స్ప్రెడర్ గా చెప్పాలి. వ్యాధి సోకిన మనుషులందరూ, అలాగే వ్యాధి సోకిన వారు పాల్గొన్న ఈవెంట్లు అన్నీ సమానంగా వైరస్ ని వ్యాపింప చేయటం జరగదని ఇన్ ఫెక్షన్ల వ్యాధుల నిపుణులు మనీషా జుతానీ అంటున్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ సూపర్ స్ప్రెడింగ్ అనే పదాన్ని కరోనా వైరస్ విషయంలో వినియోగించకపోయినప్పటికీ…. అలా వ్యాపింపచేస్తున్న కేసుని నిర్దిష్టంగా గుర్తించే ఆధారాలు లేనప్పటికీ ఈ తేడా ఉంటుందని వైద్య నిపుణులు అంటున్నారు.

నావల్ కరోనా వైరస్ పునరుత్పత్తి సంఖ్య, ఒక ఇన్ ఫెక్షన్ సోకిన వ్యక్తి నుండి సెకండరీ ఇన్ ఫెక్షన్లు ఎన్ని ఉన్నాయి అనేదాన్ని బట్టి… ఇన్ ఫెక్షన్ వ్యాప్తిని 2 నుండి 2.25 వరకు అని పరిగణిస్తారు. అయితే కొన్నిసార్లు ఇది అంతకంటే ఎక్కువగా ఉండవచ్చు. వ్యాప్తి రేటు 2.6 కంటే ఎక్కువగా ఉంటే… వారిని సూపర్ స్ప్రెడర్ గా భావిస్తారు.

ఇందుకు ఉదాహరణ చెప్పాలంటే ఫిబ్రవరి సగం నెల వరకు దక్షిణ కొరియాలో 30 మాత్రమే నిర్దారిత కరోనా కేసులు ఉన్నాయి. అయితే 31 వ కేసు మొత్తం వ్యాధి వ్యాప్తిని మార్చేసింది. ఆ 31వ కేసు ఒక మహిళగా భావిస్తున్నారు. ఆమె ఒక మత సంస్థకు సంబంధించిన సేవల్లో పాలుపంచుకుంది. ప్రతి సమావేశంలో ఆమెతో పాటు 500 మంది సహాయకులు ఉండేవారు. దాంతో ఆమె కారణంగా వేలమంది ఇన్ ఫెక్షన్ కి గురయ్యారు. ఇలాంటి చాలా ఉదాహరణలు వెలుగులోకి వచ్చాయి.

అయితే ఎవరు సూపర్ స్ప్రెడర్ గా మారతారు… అనే విషయంలో నిర్దిష్టమైన ప్రమాణాలేమీ లేవు. ఆ వ్యక్తిలో జీవ రసాయన క్రియలు ఎలా ఉన్నాయి, అతను లేదా ఆమె చేసే పని, ప్రవర్తన, వారి చుట్టూ ఉన్నవాతావరణం, ఎంతమంది మనుషులతో వారు కలిసిమెలసి ఉన్నారు, వారిలో వ్యాధి ఏ దశలో ఉన్నది…ఇలాంటి అనేక అంశాలను బట్టి వైరస్ ని వ్యాపింప చేసే స్థాయి ఆధారపడి ఉంటుంది. అలాగే రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉన్నవారిలో లక్షణాలు కనిపించకపోవటం వలన వారు మామూలుగానే సమాజంలో తిరుగుతూ ఎక్కువమందికి వైరస్ ని వ్యాపింపచేస్తారు.

ఒక వ్యక్తిలో కరోనాతో పాటు ఇన్ ఫెక్షన్ ఏదైనా కలిసి ఉంటే… అతని నుండి మరింతగా వైరస్ వ్యాపించే ప్రమాదం ఉంటుంది. సూపర్ స్ప్రెడర్ లు పెరిగితే మరింత తీవ్రంగా వ్యాధి వ్యాపిస్తుందని వేరే చెప్పాల్సిన పనిలేదు. అందుకే సామాజిక దూరం… అనే అంశం కరోనా నివారణలో అందరూ పాటించాల్సిన, అత్యంత ప్రాధాన్యత కలిగిన విషయంగా మారింది.

First Published:  18 July 2020 8:25 AM GMT
Next Story