Telugu Global
Cinema & Entertainment

ఎవరూ ఊహించని హీరోతో మారుతి

లాక్ డౌన్ టైమ్ లో ఓ మంచి స్టోరీ రాసుకున్నానని స్వయంగా మారుతి ప్రకటించాడు. దానికి సంబంధించి స్క్రీన్ ప్లే కూడా పూర్తయిందని చెప్పుకొచ్చాడు. డిఫరెంట్ కథలు రాసుకునే ఈ డైరక్టర్, ఈసారి కూడా అలాంటి డిఫరెంట్ సబ్జెక్ట్ నే హ్యాండిల్ చేయబోతున్నట్టు తెలిపాడు. అయితే ఈ ప్రాజెక్టులో హీరో ఎవరనే విషయాన్ని మాత్రం ఈ దర్శకుడు చెప్పలేదు. మొన్నటివరకు అల్లు అర్జున్ తో మారుతి ఈ సినిమా చేస్తాడని అంతా భావించారు. కానీ అల్లు అర్జున్ […]

ఎవరూ ఊహించని హీరోతో మారుతి
X

లాక్ డౌన్ టైమ్ లో ఓ మంచి స్టోరీ రాసుకున్నానని స్వయంగా మారుతి ప్రకటించాడు. దానికి సంబంధించి స్క్రీన్ ప్లే కూడా పూర్తయిందని చెప్పుకొచ్చాడు. డిఫరెంట్ కథలు రాసుకునే ఈ డైరక్టర్, ఈసారి కూడా అలాంటి డిఫరెంట్ సబ్జెక్ట్ నే హ్యాండిల్ చేయబోతున్నట్టు తెలిపాడు. అయితే ఈ ప్రాజెక్టులో హీరో ఎవరనే విషయాన్ని మాత్రం ఈ దర్శకుడు చెప్పలేదు.

మొన్నటివరకు అల్లు అర్జున్ తో మారుతి ఈ సినిమా చేస్తాడని అంతా భావించారు. కానీ అల్లు అర్జున్ మరో 7-8 నెలల వరకు బిజీ. పైగా తన కథ బన్నీకి సెట్ అయ్యేది కాదని మారుతి ఆల్రెడీ చెప్పేశాడు కూడా. సరిగ్గా ఇలాంటి టైమ్ లో ఓ ఊహించని హీరో పేరు తెరపైకొచ్చింది. అతడే గోపీచంద్.

అవును.. మారుతి దర్శకత్వంలో గోపీచంద్ సినిమా చేయబోతున్నాడట. లాక్ డౌన్ లో రాసుకున్న కథ గోపీచంద్ కు సరిగ్గా సూట్ అవుతుందని మారుతి భావిస్తున్నాడట. మీడియాకు ఎప్పుడూ అందుబాటులో ఉండే మారుతి, ఈ విషయంపై మాత్రం ఇంకా రియాక్ట్ అవ్వలేదు.

First Published:  19 July 2020 7:57 AM GMT
Next Story