Telugu Global
Cinema & Entertainment

అర్జున్ ఇంట్లో మరో బ్యాడ్ న్యూస్

హీరో అర్జున్ ఇంట్లో వరుసగా దుర్ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మొన్నటికిమొన్న అర్జున్ మేనల్లుడు చిరంజీవి గుండెపోటుతో మరణించాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు చిరంజీవి తమ్ముడు ధృవ్ సర్జా కరోనా బారిన పడ్డాడు. ఇలా వరుసగా దుర్ఘటనలు చూస్తున్న అర్జున్ కు ఇప్పుడు తన ఇంట్లోనే మరో బాధ ఎదురైంది. అవును.. స్వయంగా అర్జున్ కూతురు ఐశ్వర్య కరోనా బారిన పడింది. తనకు కరోనా సోకిన విషయాన్ని ఐశ్వర్య అర్జున్ స్వయంగా వెల్లడించింది. ప్రస్తుతం తను వైద్యుల […]

అర్జున్ ఇంట్లో మరో బ్యాడ్ న్యూస్
X

హీరో అర్జున్ ఇంట్లో వరుసగా దుర్ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మొన్నటికిమొన్న అర్జున్ మేనల్లుడు చిరంజీవి గుండెపోటుతో మరణించాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు చిరంజీవి తమ్ముడు ధృవ్ సర్జా కరోనా బారిన పడ్డాడు. ఇలా వరుసగా దుర్ఘటనలు చూస్తున్న అర్జున్ కు ఇప్పుడు తన ఇంట్లోనే మరో బాధ ఎదురైంది. అవును.. స్వయంగా అర్జున్ కూతురు ఐశ్వర్య కరోనా బారిన పడింది.

తనకు కరోనా సోకిన విషయాన్ని ఐశ్వర్య అర్జున్ స్వయంగా వెల్లడించింది. ప్రస్తుతం తను వైద్యుల సూచన మేరకు హోమ్ క్వారంటైన్ లోనే ఉంటున్నానని, మందులు తీసుకుంటున్నానని ఐశ్వర్య స్పష్టం చేసింది. ఈమధ్య కాలంలో తనతో టచ్ లోకి వచ్చిన వాళ్లంతా క్వారంటైన్ లోకి వెళ్లాలని, మాస్కులు ధరించాలని ఐశ్వర్య కోరుతోంది.

కూతురుకు కరోనా రావడంతో అర్జున్, అతడి భార్య కూడా ఐసొలేషన్ లోకి వెళ్లిపోయాడు. వైద్యులు వీళ్ల నుంచి కూడా శాంపిల్స్ తీసుకున్నారు. రేపు లేదా ఎల్లుండి ఆ ఫలితాలు రాబోతున్నాయి. పరిస్థితులన్నీ ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్నట్టు భావించిన అర్జున్.. వచ్చే వారం నుంచి తన కొత్త సినిమాను స్టార్ట్ చేయాలనుకున్నాడు. అంతలోనే ఇలా కూతురు కరోనా బారిన పడ్డంతో అతడు మరింత కుంగిపోయాడు.

First Published:  20 July 2020 9:52 AM GMT
Next Story