Telugu Global
National

దేశంలో 104 మంది డాక్టర్లను బలి తీసుకున్న కోవిడ్-19

కరోనా మహమ్మారి దేశంలో విలయతాండవం చేస్తున్నది. కోవిడ్-19 సోకిన వారిని రక్షించడానికి దేశవ్యాప్తంగా వేలాది మంది డాక్టర్లు, నర్సులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి మరీ చికిత్స చేస్తున్నారు. కాగా, జులై 13 నాటికి కరోనా బాధితులకు చికిత్స చేస్తూ 104 మంది డాక్టర్లు మృత్యువాత పడటం ఆందోళన కలిగిస్తున్నది. కొచ్చిన్ నగర ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) అధ్యక్షుడు డాక్టర్ రాజీవ్ జయదేవన్ రాసిన ఒక నివేదికలో వెల్లడించారు. మరో నలుగురు డాక్టర్లు కొవిడ్ పేషంట్లకు […]

దేశంలో 104 మంది డాక్టర్లను బలి తీసుకున్న కోవిడ్-19
X

కరోనా మహమ్మారి దేశంలో విలయతాండవం చేస్తున్నది. కోవిడ్-19 సోకిన వారిని రక్షించడానికి దేశవ్యాప్తంగా వేలాది మంది డాక్టర్లు, నర్సులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి మరీ చికిత్స చేస్తున్నారు.

కాగా, జులై 13 నాటికి కరోనా బాధితులకు చికిత్స చేస్తూ 104 మంది డాక్టర్లు మృత్యువాత పడటం ఆందోళన కలిగిస్తున్నది. కొచ్చిన్ నగర ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) అధ్యక్షుడు డాక్టర్ రాజీవ్ జయదేవన్ రాసిన ఒక నివేదికలో వెల్లడించారు. మరో నలుగురు డాక్టర్లు కొవిడ్ పేషంట్లకు చికిత్స అందిందే క్రమంలో రోడ్డు ప్రమాదాల్లో మరణించారని.. మొత్తం 108 మంది డాక్టర్లు కోవిడ్ పోరాటంలో మరణించారని ఆయన స్పష్టం చేశారు.

దేశంలో అత్యధిక కోవిడ్-19 రోగులు గుజరాత్, తమిళనాడులో ఉన్నారు. యాదృశ్చికంగా అత్యధిక మంది డాక్టర్లు ఈ రెండు రాష్ట్రాల్లోనే చనిపోవడం గమనార్హం. చనిపోయిన డాక్టర్ల వయసు కూడా 60 లోపే ఉండటం మరింత ఆందోళన కలిగిస్తున్నదని జయదేవన్ పేర్కొన్నారు. ఈ డాక్టర్లలో ఎక్కువ మంది జనరల్ ప్రాక్టీషనర్లే అని చెప్పారు. డాక్టర్లతో పాటు 10 మంది నర్సులు కూడా తమ ప్రాణాలను కోల్పోయారని ఆయన తన నివేదికలో వెల్లడించారు. వాళ్లందరి సగటు వయసు 49 ఏళ్లకంటే తక్కువేనని ఆయన చెప్పారు. ఇక హెల్త్ వర్కర్లలో 15 మంది కోవిడ్ కారణంగా మరణించారని ఆయన స్పష్టం చేశారు.

దేశవ్యాప్తంగా కరోనా బాధితులకు చికిత్స చేసే క్రమంలో డాక్టర్లు, నర్సులు, హెల్త్ వర్కర్లు మరణించడం చాలా విషాదమని ఆయన అన్నారు. చికిత్స చేసి మరణించిన వాళ్లే కాకుండా.. కోవిడ్ పేషెంట్ల కోసం ప్రయాణం చేస్తే రోడ్డు ప్రమాదాలకు కూడా గురయ్యారని ఆయన తన నివేదికలో రాశారు. 104 మంది కరోనా సోకి మరణించగా.. నలుగురు మాత్రం ఘోర రోడ్డు ప్రమాదాల్లో మరణించారని ఆయన పేర్కొన్నారు. వీరిలో 55.5 శాతం మంది 60 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవాళ్లు. 29.6 శాతం మంది 50 ఏళ్ల కంటే తక్కువ, 21 శాతం మంది 40 ఏళ్ల కంటే తక్కువ. చనిపోయిన వాళ్లలో సగం మంది జనరల్ ప్రాక్టీషనర్లు కాగా, 27 శాతం మంది శస్త్ర చికిత్స నిపుణులు అని డాక్టర్ జయదేవన్ తన నివేదికలో చెప్పారు.

First Published:  21 July 2020 3:19 AM GMT
Next Story