Telugu Global
Cinema & Entertainment

కరోనాతో షూటింగ్ స్టార్ట్ చేసిన హీరో

కరోనా దెబ్బతో అన్ని భాషల్లో సినిమా షూటింగ్స్ వాయిదా పడ్డాయి. ప్రస్తుతం వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో హీరోలంతా ఇంటికే ఫిక్స్ అయ్యారు. ఇప్పట్లో సెట్స్ పైకి వచ్చేది లేదని స్టార్ హీరోలంతా తమ నిర్మాతలు-దర్శకులకు తెగేసి చెప్పేశారు. దీంతో ప్రభుత్వాలు షూటింగ్స్ కి పర్మిషన్ ఇచ్చినప్పటికీ పెద్ద సినిమాలు సెట్స్ పైకి రావడం లేదు. అయితే కన్నడ స్టార్ హీరో సుదీప్ తొలి అడుగు వేశాడు. తన సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చాడు. సుదీప్ అప్ […]

కరోనాతో షూటింగ్ స్టార్ట్ చేసిన హీరో
X

కరోనా దెబ్బతో అన్ని భాషల్లో సినిమా షూటింగ్స్ వాయిదా పడ్డాయి. ప్రస్తుతం వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో హీరోలంతా ఇంటికే ఫిక్స్ అయ్యారు. ఇప్పట్లో సెట్స్ పైకి వచ్చేది లేదని స్టార్ హీరోలంతా తమ నిర్మాతలు-దర్శకులకు తెగేసి చెప్పేశారు. దీంతో ప్రభుత్వాలు షూటింగ్స్ కి పర్మిషన్ ఇచ్చినప్పటికీ పెద్ద సినిమాలు సెట్స్ పైకి రావడం లేదు.

అయితే కన్నడ స్టార్ హీరో సుదీప్ తొలి అడుగు వేశాడు. తన సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చాడు.
సుదీప్ అప్ కమింగ్ సినిమా ‘ఫాంటమ్’. ఈ సినిమా కొత్త షెడ్యూల్ హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో మొదలైంది.

అనూప్ బండారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ లో సుదీప్ తో పాటు మరికొంత మంది ఆర్టిస్టులు కూడా పాల్గొంటున్నారు. చాలా రోజుల తర్వాత మేకప్ వేసుకున్న విషయాన్ని, సెట్స్ పైకి వచ్చిన సంగతుల్ని కిచ్చా సుదీప్ ఓ వీడియో ద్వారా తెలిపాడు.

ఏదేమైనా కరోనా భయం లేకుండా హైదరాబాద్ వచ్చి మరీ కన్నడ హీరో షూటింగ్ చేస్తున్నాడంటే మెచ్చుకోవాల్సిందే. టాలీవుడ్ నుంచి ఎంతమంది సుదీప్ ను ఆదర్శంగా తీసుకుంటారో చూడాలి.

First Published:  21 July 2020 1:08 AM GMT
Next Story