Telugu Global
Cinema & Entertainment

రోడ్ మూవీ నుంచి తప్పుకున్న అనసూయ

బుల్లితెర హాట్ బ్యూటీ అనసూయ వెండితెరపై సెలక్టివ్ గా సినిమాలు చేస్తుంటుంది. మరీ ముఖ్యంగా “క్షణం”, “రంగస్థలం” ఇచ్చిన క్రేజ్ ను కొనసాగించాలనే తాపత్రయం ఆమెలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇందులో భాగంగా ఓ మంచి పాత్రను ఆమె అంగీకరించింది. అయితే కరోనా కారణంగా ఆ క్యారెక్టర్ ను వదులుకుంది. సుమంత్ అశ్విన్ హీరోగా ఓ రోడ్ మూవీ లాక్ డౌన్ కంటే ముందే మొదలైంది. ఇందులో సుమంత్ అశ్విన్ తో పాటు శ్రీకాంత్, ఇంద్రజ, ప్రియ వడ్లమాని […]

రోడ్ మూవీ నుంచి తప్పుకున్న అనసూయ
X

బుల్లితెర హాట్ బ్యూటీ అనసూయ వెండితెరపై సెలక్టివ్ గా సినిమాలు చేస్తుంటుంది. మరీ ముఖ్యంగా “క్షణం”, “రంగస్థలం” ఇచ్చిన క్రేజ్ ను కొనసాగించాలనే తాపత్రయం ఆమెలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇందులో భాగంగా ఓ మంచి పాత్రను ఆమె అంగీకరించింది. అయితే కరోనా కారణంగా ఆ క్యారెక్టర్ ను వదులుకుంది.

సుమంత్ అశ్విన్ హీరోగా ఓ రోడ్ మూవీ లాక్ డౌన్ కంటే ముందే మొదలైంది. ఇందులో సుమంత్ అశ్విన్ తో పాటు శ్రీకాంత్, ఇంద్రజ, ప్రియ వడ్లమాని నటిస్తున్నారు. వివిధ నేపథ్యాల నుంచి వచ్చిన ఈ నలుగురు రోడ్ ట్రిప్ లో ఎలా కలుసుకున్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందనేది స్టోరీ.

ఈ స్టోరీ నుంచి ఆఖరి నిమిషంలో ఇంద్రజను తప్పించారు. ఆమె స్థానంలో అనసూయను తీసుకున్నారు. కథ నచ్చడంతో అనసూయ వెంటనే ఒప్పుకుంది. కాకపోతే ముందే చెప్పుకున్నట్టు ఇది రోడ్ మూవీ. దేశంలోని వివిధ లొకేషన్లలో షూట్ చేయాలి. కరోనా కారణంగా ఇప్పుడు అలాంటి సన్నివేశాలు తీయడం చాలా కష్టంగా తయారైంది. అందుకే ఈ మూవీ నుంచి అనసూయ తప్పుకుంది.

మనసులో ఉన్న కోరికలు చంపుకొని పూర్తిగా కుటుంబ జీవితానికి పరిమితమైపోయిన ఓ ఇల్లాలు.. కొన్ని రోజులైనా తనకు నచ్చినట్టు జీవించడం కోసం భర్త, పిల్లల్ని ఇంట్లో వదిలేసి రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ పై రోడ్డు ట్రిప్ కు బయల్దేరే పాత్ర అనసూయది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ను కరోనా కారణంగా అనసూయ వదిలేసుకుంది.

First Published:  21 July 2020 8:44 PM GMT
Next Story