Telugu Global
Cinema & Entertainment

పవన్ ను పెళ్లికి పిలిచిన నితిన్

ఈనెల 26న హీరో నితిన్ పెళ్లి జరగబోతోంది. తన ప్రియురాలు షాలినిని నితిన్ పెళ్లాడబోతున్నాడు. హైదరాబాదులోని ఓ లగ్జరీ హోటల్ లో 26 రాత్రి 8 గంటల 30 నిమిషాలకు వీరి వివాహం జరగబోతోంది. పెళ్లి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కరోనా నిబంధనలకు లోబడి వివాహ వేడుకను నిర్వహించనున్నారు. వివాహానికి కేవలం ఇరు కుటుంబాలవారిని, సన్నిహితులను, అత్యంత ముఖ్యులను మాత్రమే ఆహ్వానిస్తున్నారు. ఇక తన వివాహానికి రావాల్సిందిగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను నితిన్ ఆహ్వానించిన సంగతి […]

పవన్ ను పెళ్లికి పిలిచిన నితిన్
X

ఈనెల 26న హీరో నితిన్ పెళ్లి జరగబోతోంది. తన ప్రియురాలు షాలినిని నితిన్ పెళ్లాడబోతున్నాడు. హైదరాబాదులోని ఓ లగ్జరీ హోటల్ లో 26 రాత్రి 8 గంటల 30 నిమిషాలకు వీరి వివాహం జరగబోతోంది. పెళ్లి పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

కరోనా నిబంధనలకు లోబడి వివాహ వేడుకను నిర్వహించనున్నారు. వివాహానికి కేవలం ఇరు కుటుంబాలవారిని, సన్నిహితులను, అత్యంత ముఖ్యులను మాత్రమే ఆహ్వానిస్తున్నారు.

ఇక తన వివాహానికి రావాల్సిందిగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను నితిన్ ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అలాగే తన అభిమాన హీరో పవన్ కల్యాణ్ ను కూడా నితిన్ ప్రత్యేకంగా ఆహ్వానించాడు. పవన్ తో పాటు హీరో వరుణ్ తేజ్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ లకు కూడా శుభలేఖలు అందాయట.

First Published:  21 July 2020 8:09 PM GMT
Next Story