Telugu Global
Cinema & Entertainment

ఆగిన రీమేక్... తెలుగులో అంతే

“అయ్యప్పనుమ్ కోషియమ్”.. చాన్నాళ్లుగా తెలుగులో నలిగిన రీమేక్ ప్రాజెక్టు ఇది. ఓ రీమేక్ ను తెలుగులో తీయడం పెద్ద కష్టం కాదు, కానీ అదే రీమేక్ ను ఇద్దరు స్టార్ హీరోలను పెట్టి మల్టీస్టారర్ గా తీయడం మాత్రం చాలా కష్టం. సితార ఎంటర్ టైన్ మెంట్స్ వాళ్లకు ఆ విషయం ఇప్పుడు అర్థమైంది. దీంతో “అయ్యప్పనుమ్ కోషియమ్” రీమేక్ ను కొన్నాళ్ల పాటు పక్కనపెట్టాలని నిర్ణయించింది ఈ సంస్థ. ఈ రీమేక్ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ కోసం […]

ఆగిన రీమేక్... తెలుగులో అంతే
X

“అయ్యప్పనుమ్ కోషియమ్”.. చాన్నాళ్లుగా తెలుగులో నలిగిన రీమేక్ ప్రాజెక్టు ఇది. ఓ రీమేక్ ను తెలుగులో తీయడం పెద్ద కష్టం కాదు, కానీ అదే రీమేక్ ను ఇద్దరు స్టార్ హీరోలను పెట్టి మల్టీస్టారర్ గా తీయడం మాత్రం చాలా కష్టం. సితార ఎంటర్ టైన్ మెంట్స్ వాళ్లకు ఆ విషయం ఇప్పుడు అర్థమైంది. దీంతో “అయ్యప్పనుమ్ కోషియమ్” రీమేక్ ను కొన్నాళ్ల పాటు పక్కనపెట్టాలని నిర్ణయించింది ఈ సంస్థ.

ఈ రీమేక్ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ కోసం బాలయ్య, రానా, రవితేజ, వెంకటేష్.. ఇలా చాలాపేర్లు తెరపైకొచ్చాయి. కానీ ఏ ఒక్క కాంబినేషన్ సెట్ అవ్వలేదు. మన హీరోల్ని మల్టీస్టారర్ కథతో ఒప్పించడం ఎంత కష్టమో నిర్మాత నాగవంశీకి తెలిసొచ్చింది. పైగా కరోనాతో హీరోల కాల్షీట్లన్నీ చెల్లాచెదురైపోవడంతో ఏ ఒక్క హీరో నుంచి నాగవంశీకి గ్రీన్ సిగ్నల్ రాలేదు.

అందుకే “అయ్యప్పనుమ్ కోషియమ్” రీమేక్ ప్రాజెక్టును కొన్నాళ్ల పాటు పక్కనపెట్టాలని సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్ణయించింది. చూస్తుంటే.. ఇది మరో “విక్రమ్ వేద” అయ్యేట్టుంది. 2018 నుంచి ఈ సినిమా రీమేక్ పై టాలీవుడ్ లో చర్చ నడుస్తోంది. ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడీ లిస్ట్ లోకి “అయ్యప్పనుమ్ కోషియమ్” కూడా చేరినట్టుంది.

First Published:  22 July 2020 1:00 AM GMT
Next Story