Telugu Global
Cinema & Entertainment

చిరంజీవి మేకోవర్ అదిరింది

ఉన్నట్టుండి సడెన్ గా చిరంజీవి వయసు సగం తగ్గినట్టు అనిపించింది. దీనికి ఓ కారణం ఉంది. గతంతో పోలిస్తే చిరు స్లిమ్ అయ్యారు. పైగా మీసాలు, గడ్డాలు లేకుండా క్లీన్ షేవ్ చేశారు. దీంతో మెగాస్టార్ మరింత యంగ్ గా కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఆయన న్యూ మేకోవర్ ఫొటోలు నెట్ లో వైరల్ అవుతున్నాయి. అయితే ఆచార్య సినిమాకు తన మేకోవర్ కు సంబంధం లేదంటున్నారు చిరు. కేవలం ఇంట్లో ఖాళీగా ఉండడం వల్ల ఇలా కొత్తగా […]

చిరంజీవి మేకోవర్ అదిరింది
X

ఉన్నట్టుండి సడెన్ గా చిరంజీవి వయసు సగం తగ్గినట్టు అనిపించింది. దీనికి ఓ కారణం ఉంది. గతంతో పోలిస్తే చిరు స్లిమ్ అయ్యారు. పైగా మీసాలు, గడ్డాలు లేకుండా క్లీన్ షేవ్ చేశారు. దీంతో మెగాస్టార్ మరింత యంగ్ గా కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఆయన న్యూ మేకోవర్ ఫొటోలు నెట్ లో వైరల్ అవుతున్నాయి.

అయితే ఆచార్య సినిమాకు తన మేకోవర్ కు సంబంధం లేదంటున్నారు చిరు. కేవలం ఇంట్లో ఖాళీగా ఉండడం వల్ల ఇలా కొత్తగా ఉంటుందని మేకోవర్ ట్రై చేశారట. మరోవైపు కసరత్తులు చేయడం మాత్రం ఆపలేదంటున్నారు చిరు. లాక్ డౌన్ తో ఇంట్లోనే ఉన్న కొంతమంది హీరోలు జిమ్ కు దూరమయ్యారు. కానీ చిరంజీవి మాత్రం బద్దకించకుండా రెగ్యులర్ గా ఎక్సర్ సైజులు చేస్తున్నారు.

ఇంతకీ చిరంజీవి ఈ కొత్త లుక్ ఎలా బయటకొచ్చిందో తెలుసా.. ఆయన కావాలని ఈ స్టిల్స్ రిలీజ్ చేయలేదు. ఈమధ్య బ్లఫ్ మాస్టర్ అనే సినిమా చూశారు చిరు. అది ఆయనకు బాగా నచ్చింది. దీంతో ఆ దర్శకుడ్ని ప్రత్యేకంగా ఇంటికి పిలిపించుకొని అభినందించారు. ఆ టైమ్ లో దిగిన ఫొటోలు ఇలా బయటకొచ్చి వైరల్ అయ్యాయి.

First Published:  23 July 2020 1:04 AM GMT
Next Story