Telugu Global
International

ఫోర్బ్స్ జాబితాలో మేఘా సంస్థ అధినేతలు

ప్రపంచ వ్యాప్తంగా ధనవంతుల జాబితాను రూపొందించే ఫోర్బ్స్ పత్రిక తెలంగాణలో అత్యంత ధనవంతులు మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫాస్ట్రక్చర్ లిమిటెడ్ (మెయిల్) వ్యవస్థాపకుడు పీపీ రెడ్డి, సంస్థ సహ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ పీవీ కృష్టారెడ్డి అని తెలిపింది. ఇక ప్రపంచ జాబితా పరంగా 1.6 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 11,947 కోట్ల రూపాయలు) నెట్ వర్త్ కలిగి పీపీ రెడ్డి 1629 స్థానంలో, ఆయన మేనల్లుడు పీవీ కృష్టారెడ్డి 1.5 బిలియన్ డాలర్లు (రూ. […]

ఫోర్బ్స్ జాబితాలో మేఘా సంస్థ అధినేతలు
X

ప్రపంచ వ్యాప్తంగా ధనవంతుల జాబితాను రూపొందించే ఫోర్బ్స్ పత్రిక తెలంగాణలో అత్యంత ధనవంతులు మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫాస్ట్రక్చర్ లిమిటెడ్ (మెయిల్) వ్యవస్థాపకుడు పీపీ రెడ్డి, సంస్థ సహ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ పీవీ కృష్టారెడ్డి అని తెలిపింది.

ఇక ప్రపంచ జాబితా పరంగా 1.6 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 11,947 కోట్ల రూపాయలు) నెట్ వర్త్ కలిగి పీపీ రెడ్డి 1629 స్థానంలో, ఆయన మేనల్లుడు పీవీ కృష్టారెడ్డి 1.5 బిలియన్ డాలర్లు (రూ. 11,201 కోట్లు)తో 1673 స్థానంలో ఉన్నారని ఫోర్బ్స్ వెల్లడించింది.

రైతు కుటుంబంలో పుట్టిన పీపీ రెడ్డి… ఆయన మేనల్లుడు కలసి 1999లో మేఘా ఇంజనీరింగ్ ఎంటర్‌ప్రైజెస్ అనే చిన్న సంస్థను స్థాపించారు. మున్సిపాలిటీల్లో నీటి పైపుల పనులను చేపట్టే వాళ్లు. ఆ తర్వాత తమ సంస్థను విస్తరించుకుంటూ వెళ్లారు. చిన్న చెక్ డ్యాంల నుంచి మొదలు పెట్టి ఇవాళ భారీ ప్రాజెక్టులు, నాచురల్ గ్యాస్ పంపిణీ వ్యవస్థలు, పవర్ ప్లాంట్లు, రోడ్లు నిర్మించే స్థాయికి ఎదిగారు.

2006లో తమ సంస్థ పేరును మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌గా పేరు మార్చారు. సంస్థ వ్యవహారాలన్నీ పూర్తిగా పీపీ రెడ్డి మేనల్లుడు, మేనేజింగ్ డైరెక్టర్ పీవీ కృష్టారెడ్డే చూస్తారు.

తెలంగాణలోని కాళేశ్వరం ఎత్తి పోతల పథకం నిర్మించి రికార్డు సృష్టించారు. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఇందులో కూడా భారీ యంత్రాలను ఉపయోగిస్తూ వేగవంతంగా పనులు పూర్తి చేస్తున్నారు.

ఇండియాలోనే కాకుండా జాంబియా, టాంజానియా, బంగ్లాదేశ్, కువైట్ వంటి దేశాల్లో కూడా మేఘా ఇంజనీరింగ్ సంస్థ భారీ ప్రాజెక్టులను చేపట్టింది. ఇక సామాజిక సేవలో కూడా మేఘా సంస్థ ముందు ఉంటుంది. కోవిడ్-19 కారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న సమయంలో తమ వంతు సాయంగా తెలంగాణకు రూ. 5 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ. 5 కోట్లను తమ వంతు సాయంగా అందించారు. ఫోర్భ్స్ జాబితాలో చోటు సంపాదించిన అతి కొద్ద మంది తెలుగువాళ్లలో మేఘా సంస్థ వ్యవస్థాపకులదే పై చేయి.

First Published:  22 July 2020 10:02 PM GMT
Next Story