Telugu Global
Cinema & Entertainment

నితిన్ నిశ్చితార్థం పూర్తి... 3 రోజుల్లో పెళ్లి

పెళ్లి పనుల్ని ప్రారంభించిన నితిన్… అందులో భాగంగా నిన్న ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు. నితిన్, షాలినిల నిశ్చితార్థం నిన్న సింపుల్ గా జరిగింది. లాక్ డౌన్ నిబంధనల మేరకు కేవలం 20-30 మంది బంధువుల సమక్షంలో, నితిన్ ఇంట్లో ఈ ఎంగేజ్ మెంట్ ప్రాసెస్ పూర్తయింది. ఈనెల 26న రాత్రి 8గంటల 30 నిమిషాలకు నితిన్-షాలిని పెళ్లి జరగనుంది. ఈ మేరకు ఓ స్టార్ హోటల్ లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. పెళ్లికి కూడా 30 మందికి మించి […]

నితిన్ నిశ్చితార్థం పూర్తి... 3 రోజుల్లో పెళ్లి
X

పెళ్లి పనుల్ని ప్రారంభించిన నితిన్… అందులో భాగంగా నిన్న ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు. నితిన్, షాలినిల నిశ్చితార్థం నిన్న సింపుల్ గా జరిగింది. లాక్ డౌన్ నిబంధనల మేరకు కేవలం 20-30 మంది బంధువుల సమక్షంలో, నితిన్ ఇంట్లో ఈ ఎంగేజ్ మెంట్ ప్రాసెస్ పూర్తయింది.

ఈనెల 26న రాత్రి 8గంటల 30 నిమిషాలకు నితిన్-షాలిని పెళ్లి జరగనుంది. ఈ మేరకు ఓ స్టార్ హోటల్ లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. పెళ్లికి కూడా 30 మందికి మించి హాజరవ్వడం లేదు. తెలంగాణ ముఖ్యంత్రి కేసీఆర్ ను నితిన్, తన పెళ్లికి ఆహ్వానించాడు. ఆయన తరఫున కుమార్తె కవిత పెళ్లికి హాజరయ్యే అవకాశం ఉంది.

ఈ ఏడాది ఏప్రిల్ లోనే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు నితిన్. భీష్మ సినిమా థియేటర్లలోకి వచ్చిన 2 నెలల్లోనే పెళ్లి తంతు ముగించి, మళ్లీ సినిమాల్లోకి వెళ్లిపోవాలని అనుకున్నాడు. కానీ కరోనాతో నితిన్ ప్లాన్స్ అన్నీ తారుమారయ్యాయి. సినిమా షూటింగ్స్ ఆగిపోవడంతో పాటు పెళ్లి కూడా వాయిదాపడింది. ఎట్టకేలకు ఈనెల 26న ఓ ఇంటివాడు కాబోతున్నాడు ఈ హీరో.

First Published:  22 July 2020 11:00 PM GMT
Next Story