Telugu Global
Cinema & Entertainment

కామెడీ డిటెక్టివ్ గా మాస్ రాజా

తెలుగుతెరపై కామెడీ డిటెక్టివ్ పాత్రలు కొత్త కాదు. చంటబ్బాయ్ సినిమాలో చిరంజీవి చేసింది అలాంటి పాత్రే. ఇక డిటెక్టివ్ నారద సినిమాలో మోహన్ బాబు పాత్ర కూడా ఇదే. అంతెందుకు.. తాజాగా థియేటర్లలోకొచ్చి సూపర్ హిట్టయిన ఏజెంట్ సాయిశ్రీనివాస్ ఆత్రేయ సినిమాలో కూడా హీరోది కామెడీ డిటెక్టివ్ పాత్రే. ఇప్పుడీ తరహా పాత్రలోకి రవితేజ కూడా షిప్ట్ అవ్వాలనుకుంటున్నాడు. అవును.. అన్నీ అనుకున్నట్టు జరిగితే త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు మాస్ రాజా. ఇందులో […]

కామెడీ డిటెక్టివ్ గా మాస్ రాజా
X

తెలుగుతెరపై కామెడీ డిటెక్టివ్ పాత్రలు కొత్త కాదు. చంటబ్బాయ్ సినిమాలో చిరంజీవి చేసింది అలాంటి పాత్రే. ఇక డిటెక్టివ్ నారద సినిమాలో మోహన్ బాబు పాత్ర కూడా ఇదే. అంతెందుకు.. తాజాగా థియేటర్లలోకొచ్చి సూపర్ హిట్టయిన ఏజెంట్ సాయిశ్రీనివాస్ ఆత్రేయ సినిమాలో కూడా హీరోది కామెడీ డిటెక్టివ్ పాత్రే.

ఇప్పుడీ తరహా పాత్రలోకి రవితేజ కూడా షిప్ట్ అవ్వాలనుకుంటున్నాడు. అవును.. అన్నీ అనుకున్నట్టు జరిగితే త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు మాస్ రాజా. ఇందులో ఆయనది కామెడీ డిటెక్టివ్ తరహా పాత్ర.

రవితేజకు ఓ ఎనర్జీ ఉంది. అతడి కామెడీకి ఓ స్టయిల్ ఉంది. ఈ రెండూ మిక్స్ చేస్తూ కామెడీ డిటెక్టివ్ పాత్రను డిజైన్ చేశాడట దర్శకుడు. ప్రస్తుతం క్రాక్ సినిమా పనిలో బిజీగా ఉన్న రవితేజ.. ఆ సినిమా వర్క్ పూర్తయిన వెంటనే త్రినాథరావు నక్కిన సినిమాపై ఓ నిర్ణయం తీసుకుంటాడు.

First Published:  23 July 2020 6:00 AM GMT
Next Story