అది రానా పెళ్లి కార్డు కాదు

రానా-మిహీకా జంట వచ్చేనెల 8న పెళ్లి చేసుకోబోతోంది. వీళ్ల పెళ్లికి సంబంధించి ఓ అందమైన ఈ-వెడ్డింగ్ కార్డ్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. మాయాబజార్ సినిమాలో మాయాపేటిక కాన్సెప్ట్ ను తీసుకొని వీడియో వెడ్డింగ్ కార్డ్ డిజైన్ చేశారు. మేజిక్ బాక్స్ తెరిచిన వెంటనే రానా-మిహీకాల ఫొటోలు, వాళ్ల పెళ్లికి సంబంధించిన డీటెయిల్స్ వచ్చేలా దీన్ని డిజైన్ చేశారు.

వీడియో ప్రకారం.. ఆగస్ట్ 8న మధ్యాహ్నం 2 గంటలకు రానా-మిహీకాల పెళ్లి జరుగుతుంది. హైదరాబాద్ మణికొండలోని చైతన్య ఎన్ క్లేవ్ లో రానా-మిహీకాల పెళ్లి జరగనుంది.

అయితే ఆ కార్డుకు తమకు ఎలాంటి సంబంధం లేదని దగ్గుబాటి కాంపౌండ్ స్పష్టం చేసింది. ఎవరో ఫ్యాన్స్ అవి చేసి ఉంటారని స్పష్టంచేసింది. ఆ వీడియో వెడ్డింగ్ కార్డులో పెళ్లి తేదీ మినహా మిగతాదంతా అవాస్తవమని అంటున్నారు.

లాక్ డౌన్ నిబంధనలకు తగ్గట్టు తక్కువమంది అతిథుల సమక్షంలో ఈ పెళ్లి వేడుకను జరిపించబోతున్నారు.