Telugu Global
Cinema & Entertainment

బిచ్చగాడు మళ్లీ వస్తున్నాడు

బిచ్చగాడు.. ఈ సినిమాకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన ఈ సినిమా కోలీవుడ్ లో సూపర్ డూపర్ హిట్టయింది. తర్వాత ఇదే సినిమాను తెలుగులో రానా హీరోగా రీమేక్ చేయాలనుకున్నారు. కానీ రానా ఒప్పుకోకపోవడంతో డైరక్ట్ గా డబ్బింగ్ చేశారు. డబ్బింగ్ వెర్షన్ లో కూడా ఈ సినిమా సూపర్ హిట్టయింది. బుల్లితెరపై కూడా బిచ్చగాడు ప్రభంజనం కనిపించింది. బాహుబలి తర్వాత ఆ స్థాయి రేటింగ్ వచ్చింది. ఇలా సంచలనాలకు మారుపేరుగా […]

బిచ్చగాడు మళ్లీ వస్తున్నాడు
X

బిచ్చగాడు.. ఈ సినిమాకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన ఈ సినిమా కోలీవుడ్ లో సూపర్ డూపర్ హిట్టయింది. తర్వాత ఇదే సినిమాను తెలుగులో రానా హీరోగా రీమేక్ చేయాలనుకున్నారు. కానీ రానా ఒప్పుకోకపోవడంతో డైరక్ట్ గా డబ్బింగ్ చేశారు. డబ్బింగ్ వెర్షన్ లో కూడా ఈ సినిమా సూపర్ హిట్టయింది. బుల్లితెరపై కూడా బిచ్చగాడు ప్రభంజనం కనిపించింది. బాహుబలి తర్వాత ఆ స్థాయి రేటింగ్ వచ్చింది.

ఇలా సంచలనాలకు మారుపేరుగా మారిన బిచ్చగాడు మరోసారి వస్తున్నాడు. అవును.. బిచ్చగాడు సినిమాకు సీక్వెల్ సెట్ అయింది. విజయ్ ఆంటోనీ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా సీక్వెల్ ను ప్రకటించడంతో పాటు ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు.

తల్లి కోలుకోవాలని బిచ్చగాడిగా మారతాడు హీరో. క్లైమాక్స్ లో తల్లి కోలుకున్నట్టు చూపిస్తారు. హీరో మళ్లీ కోటీశ్వరుడిగా మారతాడు. పైగా తన ప్రయాణంలో ఓ ప్రేయసిని కూడా దక్కించుకుంటాడు. పెళ్లి కూడా చేసుకుంటాడు. ఇలా పూర్తిగా సుఖాంతమైన ఈ సినిమాను మళ్లీ కొనసాగించడం ఎలా అనే ప్రశ్న నుంచి ప్రారంభించి సీక్వెల్ ను సిద్ధం చేశారట. జాతీయ అవార్డ్ గ్రహీత ప్రియ కృష్ణస్వామి ఈ సీక్వెల్ ను డైరక్ట్ చేయబోతున్నారు.

First Published:  24 July 2020 9:09 AM GMT
Next Story