Telugu Global
National

హైకోర్టు వ్యాఖ్యలపై ప్రమోటీ ఐపీఎస్‌ ల సంఘం అభ్యంతరం

హైకోర్టు చేసిన వ్యాఖ్యలపై ఏపీ ప్రమోటీ ఐపీఎస్‌ల సంఘం అభ్యంతరం తెలిపింది. తమ ఆవేదనను వివరిస్తూ డీజీపీకి ప్రమోట్ ఐపీఎస్‌ల సంఘం లేఖ రాసింది. హైకోర్టు వ్యాఖ్యలు ప్రమోటీ ఐపీఎస్ ల‌పై ప్రజల్లో చులకన భావం కలిగించేలా ఉన్నాయని లేఖలో అభిప్రాయపడింది. ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో ఒక హెబియస్ కార్పస్ పిటిషన్ విషయంలో తూర్పుగోదావరి జిల్లా ఎస్పీని హైకోర్టుకు పిలిపించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు కావాలనుకుంటే పోలీస్ యూనిఫాం వదిలేసి వెళ్లి […]

హైకోర్టు వ్యాఖ్యలపై ప్రమోటీ ఐపీఎస్‌ ల సంఘం అభ్యంతరం
X

హైకోర్టు చేసిన వ్యాఖ్యలపై ఏపీ ప్రమోటీ ఐపీఎస్‌ల సంఘం అభ్యంతరం తెలిపింది. తమ ఆవేదనను వివరిస్తూ డీజీపీకి ప్రమోట్ ఐపీఎస్‌ల సంఘం లేఖ రాసింది. హైకోర్టు వ్యాఖ్యలు ప్రమోటీ ఐపీఎస్ ల‌పై ప్రజల్లో చులకన భావం కలిగించేలా ఉన్నాయని లేఖలో అభిప్రాయపడింది.

ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో ఒక హెబియస్ కార్పస్ పిటిషన్ విషయంలో తూర్పుగోదావరి జిల్లా ఎస్పీని హైకోర్టుకు పిలిపించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు కావాలనుకుంటే పోలీస్ యూనిఫాం వదిలేసి వెళ్లి ఖద్దరు చొక్కా వేసుకోండి అంటూ న్యాయమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

న్యాయమూర్తి రాకేష్ కుమార్‌ తూర్పుగోదావరి జిల్లా ఎస్పీని ఉద్దేశించి మీరు డైరెక్ట్ రిక్రూటీ అయ్యారా లేక ప్రమోటీ ఐపీఎస్సా అని ప్రశ్నించారు. అందుకు జిల్లా ఎస్పీ తాను డైరెక్ట్‌ రిక్రూటీ ఐపీఎస్‌నే అని సమాధానం ఇచ్చారు. డైరెక్ట్ రిక్రూటీ అయిన వారు ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారన్న ఆశ ఉంటుంది… డైరెక్ట్ రిక్రూటీ అయి ఉండి ఇలా ఎందుకు వ్యవహరించారు అంటూ న్యాయమూర్తి రాకేష్‌ కుమార్ వ్యాఖ్యానించారు.

ఇలా డైరెక్ట్ రిక్రూటీనా, ప్రమోటీనా అని పోల్చడం పట్ల ప్రమోటీ ఐపీఎస్‌ సంఘం అభ్యంతరం తెలిపింది. హైకోర్టు వ్యాఖ్యలు ప్రమోటీ ఐపీఎస్‌లను చులకన చేసేలా ఉన్నాయని డీజీపీకి రాసిన లేఖలో ప్రమోటీ ఐపీఎస్‌ల సంఘం డీజీపీకి రాసిన లేఖలో అభ్యంతరం తెలిపింది.

First Published:  24 July 2020 10:32 PM GMT
Next Story