Telugu Global
Cinema & Entertainment

చిరంజీవిని వదలని పూరి

మెగాస్టార్ చిరంజీవిని డైరక్ట్ చేయాలనేది పూరి జగన్నాధ్ జీవితాశయం. ఈ మేరకు ఆయన గతంలో ప్రయత్నాలు చేశాడు కూడా. అన్నీ అనుకున్నట్టు జరిగితే చిరంజీవి రీఎంట్రీ మూవీని డైరక్ట్ చేయాల్సిన వ్యక్తి పూరి జగన్నాధే. కానీ పూరి చెప్పిన ఆటోజానీ స్టోరీ సెకెండాఫ్ చిరంజీవికి నచ్చక, దాన్ని పక్కనపెట్టేశారు. అప్పట్నుంచి మెగాకాంపౌండ్ కు దూరమైన పూరి జగన్నాధ్, ఇప్పుడు మరోసారి తన ప్రయత్నాల్ని ముమ్మరం చేశారు. తాజాగా చిరంజీవిని కలిసిన ఈ దర్శకుడు, ఓ కొత్త స్టోరీలైన్ […]

చిరంజీవిని వదలని పూరి
X

మెగాస్టార్ చిరంజీవిని డైరక్ట్ చేయాలనేది పూరి జగన్నాధ్ జీవితాశయం. ఈ మేరకు ఆయన గతంలో ప్రయత్నాలు చేశాడు కూడా. అన్నీ అనుకున్నట్టు జరిగితే చిరంజీవి రీఎంట్రీ మూవీని డైరక్ట్ చేయాల్సిన వ్యక్తి పూరి జగన్నాధే. కానీ పూరి చెప్పిన ఆటోజానీ స్టోరీ సెకెండాఫ్ చిరంజీవికి నచ్చక, దాన్ని పక్కనపెట్టేశారు.

అప్పట్నుంచి మెగాకాంపౌండ్ కు దూరమైన పూరి జగన్నాధ్, ఇప్పుడు మరోసారి తన ప్రయత్నాల్ని ముమ్మరం చేశారు. తాజాగా చిరంజీవిని కలిసిన ఈ దర్శకుడు, ఓ కొత్త స్టోరీలైన్ వినిపించాడట. దానికి చిరంజీవి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు తెలుస్తోంది.

ఈ సందర్భంగా చిరంజీవి, పూరి జగన్నాధ్ కు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈసారి పూరి జగన్నాధ్ పెర్ ఫెక్ట్ స్టోరీ-స్క్రీన్ ప్లేతో వస్తే.. తన లిస్ట్ లో ఉన్న మిగతా దర్శకులందర్నీ పక్కనపెట్టి.. అతడితోనే సినిమా చేస్తానని పూరికి మాటిచ్చారట చిరంజీవి.

నిజంగా ఇది పూరికి బంపర్ ఆఫరే. ఇస్మార్ట్ శంకర్ తో ఊపుమీదున్న ఈ దర్శకుడు.. ఈసారి ఎలాగైనా చిరంజీవిని ఒప్పించాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు. స్టోరీ ఓకే అయితే.. లూసిఫర్ తర్వాత పూరి సినిమానే ఉండొచ్చు.

First Published:  25 July 2020 1:00 AM GMT
Next Story