Telugu Global
Cinema & Entertainment

హాలీవుడ్ సీరియల్ లో కాజల్

హీరోయిన్లకు వయసు పెరిగేకొద్దీ అవకాశాలు తగ్గుతాయి. తప్పనిసరి పరిస్థితుల మధ్య వయసులో ఉన్నప్పటికీ తల్లి, అక్క పాత్రలు చేస్తుంటారు చాలామంది హీరోయిన్లు. కానీ కాజల్ పరిస్థితి మాత్రం దీనికి రివర్స్. ఇండస్ట్రీకొచ్చి 12 ఏళ్లు దాటినా ఇప్పటికీ ఆమెకు అవకాశాలు క్యూ కడుతున్నాయి. అది చాలదన్నట్టు ఇప్పుడామె చేతికి ఓ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ కూడా వచ్చేలా ఉంది. హాలీవుడ్ లో ప్రియాంక చోప్రా ఓ టీవీ సీరియల్ చేసింది. దానిపేరు క్వాంటికో. ఇప్పుడీ సీరియల్ ను ఇండియాలో […]

హాలీవుడ్ సీరియల్ లో కాజల్
X

హీరోయిన్లకు వయసు పెరిగేకొద్దీ అవకాశాలు తగ్గుతాయి. తప్పనిసరి పరిస్థితుల మధ్య వయసులో ఉన్నప్పటికీ తల్లి, అక్క పాత్రలు చేస్తుంటారు చాలామంది హీరోయిన్లు. కానీ కాజల్ పరిస్థితి మాత్రం దీనికి రివర్స్. ఇండస్ట్రీకొచ్చి 12 ఏళ్లు దాటినా ఇప్పటికీ ఆమెకు అవకాశాలు క్యూ కడుతున్నాయి. అది చాలదన్నట్టు ఇప్పుడామె చేతికి ఓ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ కూడా వచ్చేలా ఉంది.

హాలీవుడ్ లో ప్రియాంక చోప్రా ఓ టీవీ సీరియల్ చేసింది. దానిపేరు క్వాంటికో. ఇప్పుడీ సీరియల్ ను ఇండియాలో వెబ్ సిరీస్ రూపంలో తీసుకురావాలని అనుకుంటున్నారు మేకర్స్. వివిధ భాషల్లో రీమేక్ చేయాలనుకుంటున్న క్వాంటికో సిరీస్ కోసం కాజల్ ను సంప్రదించారట.

కాజల్ కు సౌత్ తో పాటు హిందీలో కూడా క్రేజ్ ఉంది. కాబట్టి ఆమెను పెట్టి తీస్తే అన్ని భాషల్లో రీచ్ ఉంటుందని హాలీవుడ్ మేకర్స్ భావిస్తున్నారట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది.

First Published:  24 July 2020 10:03 PM GMT
Next Story