Telugu Global
National

రాయపాటికి చిక్కులు... ఆస్తుల వేలం

మాజీ ఎంపీ, టీడీపీ నేత రాయపాటి సాంబశివరావుకు కష్టాలు చుట్టుముడుతున్నాయి. ట్రాన్స్‌ట్రాయ్ ఆస్తుల వేలానికి రంగం సిద్ధమైంది. సెంట్రల్ బ్యాంకు నుంచి రుణం తీసుకుని ఎగ్గొట్టిన వ్యవహారంలో ట్రాన్స్‌ట్రాయ్‌కి చెందిన ఆస్తులను వేలం వేయనున్నారు. సుమారు 452 కోట్ల రూపాయలు సెంట్రల్‌ బ్యాంకుకు చెల్లించాల్సి ఉంది. తనఖా పెట్టిన ఆస్తులను ఆగస్ట్ 18న వేలం వేయనున్నట్టు సెంట్రల్ బ్యాంకు ప్రకటించింది. 2017 జనవరి 9 నాటికే సెంట్రల్ బ్యాంకుకు చెల్లించాల్సిన అప్పు మొత్తం 452 కోట్లకు చేరింది. […]

రాయపాటికి చిక్కులు... ఆస్తుల వేలం
X

మాజీ ఎంపీ, టీడీపీ నేత రాయపాటి సాంబశివరావుకు కష్టాలు చుట్టుముడుతున్నాయి. ట్రాన్స్‌ట్రాయ్ ఆస్తుల వేలానికి రంగం సిద్ధమైంది. సెంట్రల్ బ్యాంకు నుంచి రుణం తీసుకుని ఎగ్గొట్టిన వ్యవహారంలో ట్రాన్స్‌ట్రాయ్‌కి చెందిన ఆస్తులను వేలం వేయనున్నారు. సుమారు 452 కోట్ల రూపాయలు సెంట్రల్‌ బ్యాంకుకు చెల్లించాల్సి ఉంది. తనఖా పెట్టిన ఆస్తులను ఆగస్ట్ 18న వేలం వేయనున్నట్టు సెంట్రల్ బ్యాంకు ప్రకటించింది.

2017 జనవరి 9 నాటికే సెంట్రల్ బ్యాంకుకు చెల్లించాల్సిన అప్పు మొత్తం 452 కోట్లకు చేరింది. రుణం హామీదారులుగా ట్రాన్స్‌ట్రాయ్‌ మాజీ ఎండీ శ్రీధర్‌, రాయపాటితో పాటు మరో ఐదుగురు ఉన్నారు. అయితే తీసుకున్న రుణం కంటే ఆస్తుల విలువ అధికంగా ఉంటుందా లేదా అన్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

రాయపాటికి చెందిన ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీ ఐదు బ్యాంకుల నుంచి 3వేల 800 కోట్ల రుణం తీసుకుని ఎగ్గొట్టిన వ్యవహారంలో గతేడాది డిసెంబర్‌ ఆఖరిలో సీబీఐ కేసు కూడా నమోదు చేసింది.

వివిధ బ్యాంకుల నుంచి ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీ 3వేల 800 కోట్ల రూపాయల రుణం తీసుకుని ఆ నిధులను అక్రమంగా సింగపూర్‌తో పాటు ఇతర దేశాలకు తరలించినట్టు సీబీఐ తన ఎఫ్‌ఐఆర్‌లో వెల్లడించింది. ఇతర బ్యాంకుల నుంచి తీసుకున్న వేల కోట్ల రూపాయల రుణాలకు సంబంధించిన అంశాన్ని దాచిపెట్టి యూనియన్ బ్యాంకు నుంచి 264 కోట్లు తీసుకున్నారు. కుట్రపూరితంగానే రుణం ఎగ్గొట్టారంటూ యూనియన్ బ్యాంకు ఇచ్చిన ఫిర్యాదుతో రాయపాటి సాంబశివరావు, చెరుకూరి శ్రీధర్‌పై సీబీఐ కేసు నమోదు అయింది.

First Published:  25 July 2020 7:12 AM GMT
Next Story