Telugu Global
National

ఆర్టీసీ ఉద్యోగులను కాపాడిన విలీనం... వచ్చిన ఆదాయం 104 కోట్లే...

కరోనా… ఆర్టీసీపై ప్రత్యక్షంగా తీవ్ర ప్రభావం చూపింది. రెండు నెలల్లో ఆర్టీసీకి కేవలం 104 కోట్ల రూపాయల  ఆదాయం మాత్రమే వచ్చింది. మే 21 నుంచి సర్వీసులు తిరిగి ప్రారంభించగా… ఈ రెండు నెలల కాలంలో కేవలం 104 కోట్ల రూపాయల ఆదాయం మాత్రమే వచ్చింది. గతేడాది ఇదే కాలానికి 854 కోట్ల ఆదాయం వచ్చింది. ఆ లెక్కతో పోలిస్తే ఆర్టీసీ 750 కోట్ల ఆదాయం కోల్పోయింది. ప్రతి నెలా ఉద్యోగుల జీతాలకే 300 కోట్లు ఖర్చు […]

ఆర్టీసీ ఉద్యోగులను కాపాడిన విలీనం... వచ్చిన ఆదాయం 104 కోట్లే...
X

కరోనా… ఆర్టీసీపై ప్రత్యక్షంగా తీవ్ర ప్రభావం చూపింది. రెండు నెలల్లో ఆర్టీసీకి కేవలం 104 కోట్ల రూపాయల ఆదాయం మాత్రమే వచ్చింది. మే 21 నుంచి సర్వీసులు తిరిగి ప్రారంభించగా… ఈ రెండు నెలల కాలంలో కేవలం 104 కోట్ల రూపాయల ఆదాయం మాత్రమే వచ్చింది.

గతేడాది ఇదే కాలానికి 854 కోట్ల ఆదాయం వచ్చింది. ఆ లెక్కతో పోలిస్తే ఆర్టీసీ 750 కోట్ల ఆదాయం కోల్పోయింది.

ప్రతి నెలా ఉద్యోగుల జీతాలకే 300 కోట్లు ఖర్చు అవుతుంది. రెండు నెలలకు 600 కోట్లు జీతాలకే చెల్లించాల్సి ఉండగా… 104 కోట్ల ఆదాయమే వచ్చింది.

ఆర్టీసీ ఉద్యోగులను వైఎస్ జగన్… ఇటీవల ప్రభుత్వంలో విలీనం చేయడంతో కార్మికుల జీతాలకు ఎటువంటి ఇబ్బంది ఎదురుకాలేదు. ఒకవేళ ప్రభుత్వంలో విలీనం చేసి ఉండకపోతే ఆర్టీసీ జీతాలు కూడా చెల్లించలేక చేతులెత్తేసేది. సంస్థ కుదేలై ఉండేది.

First Published:  25 July 2020 9:10 PM GMT
Next Story