Telugu Global
International

అందుకే నాకు అవకాశాలు రావటం లేదు.... ఎ ఆర్ రెహమాన్

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తరువాత… అక్కడ ఉన్న బంధుప్రీతి, వారసత్వ పోకడలపై పెద్ద ఎత్తున విమర్శలు కొనసాగుతున్నాయి. కొత్తవారిని రానీయటం లేదని, టాలెంట్ ఉన్నా వారికి అవకాశాలు రావటం లేదని, పరిశ్రమ మొత్తాన్ని కొందరు పెద్దలు శాసిస్తున్నారని… ఇలా ఎన్నో వింటున్నాం. ఈ విషయంలో కంగనారనౌత్ ఒక అవిశ్రాంత పోరాటమే చేస్తోంది. ఈ క్రమంలో ఇదే విషయంపై ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు విజేత ఎ ఆర్ రెహమాన్ సైతం […]

అందుకే నాకు అవకాశాలు రావటం లేదు.... ఎ ఆర్ రెహమాన్
X

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తరువాత… అక్కడ ఉన్న బంధుప్రీతి, వారసత్వ పోకడలపై పెద్ద ఎత్తున విమర్శలు కొనసాగుతున్నాయి. కొత్తవారిని రానీయటం లేదని, టాలెంట్ ఉన్నా వారికి అవకాశాలు రావటం లేదని, పరిశ్రమ మొత్తాన్ని కొందరు పెద్దలు శాసిస్తున్నారని… ఇలా ఎన్నో వింటున్నాం.

ఈ విషయంలో కంగనారనౌత్ ఒక అవిశ్రాంత పోరాటమే చేస్తోంది. ఈ క్రమంలో ఇదే విషయంపై ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు విజేత ఎ ఆర్ రెహమాన్ సైతం స్పందించారు. సుశాంత్ సింగ్ నటించిన చివరి సినిమా దిల్ బేచారా కోసం తొమ్మిది పాటలకు సంగీతం సమకూర్చారు రెహమాన్.

తన గురించి హిందీ చిత్రసీమలో ఒక గ్యాంగు తప్పుడు పుకార్లను ప్రచారం చేస్తోందని, అందుకే తనకు సరైన అవకాశాలు రావటం లేదని రెహమాన్ అన్నారు. తమిళ సినిమాలతో పోలిస్తే హిందీలో తక్కువ సినిమాలు ఎందుకు చేస్తున్నారని ఒక రేడియో కార్యక్రమంలో అడిగినప్పుడు రెహమాన్ ఇలా స్పందించారు.

‘నేను మంచి సినిమాలకు నో చెప్పను. అయితే కొన్నిసందర్భాల్లో కొందరు నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేకపోవటం వలన… ఒక గ్యాంగ్ పనికట్టుకుని నాపై పుకార్లు సృష్టిస్తోంది. ముఖేష్ చాబ్రా సినిమా కోసం రెండు రోజుల్లో నాలుగు పాటలు కంపోజ్ చేసి ఇచ్చాను. అతనన్నాడు… సర్, ఎంతోమంది మీ దగ్గరకు వెళ్లవద్దని నాకు పదేపదే చెప్పారు. మీ గురించి కథలు కథలుగా చెబుతున్నారు అని. మంచి సినిమాలు నా దగ్గరకు ఎందుకు రావటం లేదో, హిందీలో నాకు అవకాశాలు తక్కువగా రావడానికి కారణం ఏమిటో నాకు అర్థమైంది. నాకు హాని చేస్తున్నారనే అవగాహన లేకుండానే ఒక పెద్దగ్యాంగు నాకు వ్యతిరేకంగా పనిచేస్తోంది’ అంటూ చెప్పుకొచ్చారు రెహమాన్.

‘ప్రేక్షకులు ఆశిస్తున్న సినిమాలు చేయలేకపోతున్నాను. అందుకు ఆ వ్యక్తులు అడ్డుపడుతున్నారు. కానీ నేను విధిని నమ్ముతాను. మన వద్దకు వచ్చినది ఏదైనా దేవుని నుండి వచ్చినదే అని నేను భావిస్తాను. అందుకే నా దగ్గరకు వచ్చిన సినిమాలు నేను చేస్తున్నాను. అయితే మంచి సినిమాలు చేయమని నన్ను మీరు నిరంతరం అడుగుతూనే ఉండవచ్చు’ అన్నారు రెహమాన్.

First Published:  26 July 2020 10:03 AM GMT
Next Story