హైదరాబాద్‌ మేయర్‌కు కరోనా…. హోం క్వారంటైన్‌లో చికిత్స

తెలంగాణలో మరో ప్రజాప్రతినిధికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్యేలు కరోనా బారినపడ్డారు. తాజాగా జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ కు కరోనా వైరస్‌ సోకింది.

ఆదివారం నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్‌ గా నిర్దారణ అయింది. ఆయన కుటుంబ సభ్యులకు మాత్రం నెగటివ్‌ వచ్చింది. దీంతో ఆయన హోం క్వారంటైన్‌లోకి వెళ్ళిపోయారు.

మేయర్‌కు ఎటువంటి లక్షణాలు లేవు. ర్యాపిడ్‌ టెస్టుల్లో ఆయనకు పాజిటివ్‌ వచ్చింది. గత నెలలో రామ్మోహన్‌ డ్రైవర్‌కు కరోనా సోకింది. అప్పటి నుంచి ఆయన రెండు సార్లు టెస్ట్‌ చేయించుకున్నారు. నెగటివ్‌ వచ్చింది.

తాజాగా ఇటీవల నగరంలో పలు పర్యటనలు చేశారు. దీంతో ఇవాళ టెస్ట్‌ చేయించుకోవడంతో పాజిటివ్‌ గా తేలింది. డాక్టర్ల సూచన మేరకు హోం క్వారంటైన్‌లో ఉన్నారు. కరోనా తగ్గిన తర్వాత ప్లాస్మా ఇచ్చేందుకు సిద్ధమని బొంతు రామ్మోహన్ చెప్పారు.