Telugu Global
National

ఏపీలో సెకను‌కు ఒకరు చచ్చిపోతున్నారట... చంద్రబాబు నోట మాట

కరోనాపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. టీడీపీ అనుబంధ ఏపీలోని కార్పొరేట్‌ ఆస్పత్రుల డాక్టర్లతో జూమ్ మీటింగ్ నిర్వహించిన చంద్రబాబునాయుడు… ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి తరహాలోనే సమావేశం నిర్వహించారు. కరోనాను ఎదుర్కొవడానికి సలహాలు ఇవ్వాల్సిందిగా డాక్టర్లను కోరారు. తగిన సలహాలు ఇస్తే కేంద్రానికి నివేదిక అందజేస్తానని చంద్రబాబు చెప్పారు. ప్రతి ఆదివారం కేంద్ర ప్రభుత్వానికి తాను నివేదిక పంపుతున్నట్టు చంద్రబాబు వివరించారు. ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కరోనా నియంత్రణలో ఏపీ ప్రభుత్వం […]

ఏపీలో సెకను‌కు ఒకరు చచ్చిపోతున్నారట... చంద్రబాబు నోట మాట
X

కరోనాపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. టీడీపీ అనుబంధ ఏపీలోని కార్పొరేట్‌ ఆస్పత్రుల డాక్టర్లతో జూమ్ మీటింగ్ నిర్వహించిన చంద్రబాబునాయుడు… ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి తరహాలోనే సమావేశం నిర్వహించారు. కరోనాను ఎదుర్కొవడానికి సలహాలు ఇవ్వాల్సిందిగా డాక్టర్లను కోరారు. తగిన సలహాలు ఇస్తే కేంద్రానికి నివేదిక అందజేస్తానని చంద్రబాబు చెప్పారు.

ప్రతి ఆదివారం కేంద్ర ప్రభుత్వానికి తాను నివేదిక పంపుతున్నట్టు చంద్రబాబు వివరించారు. ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కరోనా నియంత్రణలో ఏపీ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. క్వారంటైన్‌ కేంద్రాల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని… రోగులకు సరైన భోజనం కూడా పెట్టడం లేదని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి సెకనుకు ఒకరు కరోనాతో చనిపోతున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు అందరినీ షాక్‌కు గురి చేస్తున్నాయి.

చంద్రబాబు చెప్పిన లెక్క ప్రకారం చూస్తే సెకనుకు ఒకరు చనిపోతే నిమిషానికి 60 మంది చనిపోతున్నారన్న మాట. గంటకు 3,600 మంది, రోజుకు 86వేల మంది చనిపోతుండాలి. దీన్ని బట్టి చంద్రబాబు కావాలని వ్యాఖ్యలు చేశారో, లేక మాటపై పట్టుతప్పి మాట్లాడారో గానీ… ఆయన చేసిన వ్యాఖ్యలు పూర్తి అవాస్తవమన్నది స్పష్టంగా అర్థమవుతోంది.

మోడీపై మాత్రం చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. ప్రధాని పిలుపు మేరకు ఆగస్ట్ 15న కరోనాతో చనిపోయిన ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు నివాళులర్పిస్తామని చంద్రబాబు ప్రకటించారు.

First Published:  25 July 2020 9:13 PM GMT
Next Story