ఇస్మార్ట్ బ్యూటీపై కరోనా ఎఫెక్ట్

దేశాన్నే కాదు, మొత్తం ప్రపంచాన్నే వణికిస్తోంది కరోనా. దీంతో హీరోహీరోయిన్లంతా ఎక్కడివాళ్లు అక్కడ లాక్ అయిపోయారు. ఇంటి గడప దాటి బయట అడుగుపెట్టడానికి భయపడుతున్నారు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు రావాల్సి వచ్చినప్పుడు ఏం చేయాలి. సరిగ్గా ఇక్కడే హీరోయిన్ నిధి అగర్వాల్.. మరిన్ని అదనపు జాగ్రత్తలు చెబుతోంది.

“కరోనా వైరస్ మొదలైనప్పట్నుంచి నేను మరింత జాగ్రత్తగా ఉంటున్నాను. మా కుక్కల్ని ప్రతి రోజూ నేను బయటకు వాకింగ్ కు తీసుకెళ్తాను. ఆ టైమ్ లో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాను. ముఖానికి మాస్క్ వేసుకుంటున్నాను. దానిపైన ఫేస్ షీల్డ్ కూడా పెట్టుకుంటున్నాను. అంతేకాదు.. ఇంటికొచ్చిన తర్వాత చేతులు కడుక్కోవడంతో పాటు నా కుక్కల బెల్టులు, చైన్లు కూడా కడుగుతున్నాను.”

ఇలా తను తీసుకుంటున్న జాగ్రత్తల్ని వివరించింది నిధి అగర్వాల్. ఎవరైనా బయట నుంచి ఇంట్లోకి వచ్చినప్పుడు ప్రతి వస్తువును శానిటైజ్ చేయాలని చెబుతోంది నిథి. కేవలం మనల్ని మనం శుభ్రంగా ఉంచుకుంటే సరిపోదని, బయట నుంచి కాంటాక్ట్ లోకి వచ్చిన ప్రతి వస్తువును, ఉపరితలాన్ని శుభ్రం చేయాలంటోంది. ఈ రోజుల్లో ఈమాత్రం జాగ్రత్త ఉండడం మంచిదే.