Telugu Global
NEWS

గులాబీ దళానికి సోషల్ మీడియా సెగ... పూర్తిగా సైలెంట్‌ !

లాక్‌డౌన్‌ కాలంలో తెలంగాణలో కరోనా కంట్రోల్ లోనే ఉంది. జూన్‌ 1 నాటికి పెద్దగా కేసులు లేవు. ఇక వైరస్ వ్యాప్తి‌ తగ్గిందని అనుకున్నారు. కానీ అన్‌లాక్‌ తర్వాత ఒక్కసారిగా కేసులు పెరిగాయి. ప్రభుత్వంపై విమర్శలు పెరిగాయి. ఇదే సమయంలో సోషల్‌ మీడియాలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు ట్రోల్ అవుతున్నాయి. ‘వేరీజ్‌ కేసీఆర్’‌ అంటూ ఓ క్యాంపెయిన్‌ కూడా నడిచింది. ఒక్కసారిగా సోషల్‌మీడియాలో వేడి పెరిగింది. వారం పది రోజులు తెగ పోస్టులు పెట్టారు. ఇన్నాళ్లు న్యూట్రల్‌గా […]

గులాబీ దళానికి సోషల్ మీడియా సెగ... పూర్తిగా సైలెంట్‌ !
X

లాక్‌డౌన్‌ కాలంలో తెలంగాణలో కరోనా కంట్రోల్ లోనే ఉంది. జూన్‌ 1 నాటికి పెద్దగా కేసులు లేవు. ఇక వైరస్ వ్యాప్తి‌ తగ్గిందని అనుకున్నారు. కానీ అన్‌లాక్‌ తర్వాత ఒక్కసారిగా కేసులు పెరిగాయి. ప్రభుత్వంపై విమర్శలు పెరిగాయి.

ఇదే సమయంలో సోషల్‌ మీడియాలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు ట్రోల్ అవుతున్నాయి. ‘వేరీజ్‌ కేసీఆర్’‌ అంటూ ఓ క్యాంపెయిన్‌ కూడా నడిచింది. ఒక్కసారిగా సోషల్‌మీడియాలో వేడి పెరిగింది. వారం పది రోజులు తెగ పోస్టులు పెట్టారు. ఇన్నాళ్లు న్యూట్రల్‌గా ఉన్నవారు కూడా కరోనా విషయంలో ప్రభుత్వాన్ని తప్పుపట్టారు.

ఆ తర్వాత సచివాలయం కూల్చివేత… హరితహారం పేరిట కార్యక్రమాలు, సభలు నిర్వహించడం, మంత్రుల పర్యటనలు ఇలా.. వరుస పెట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఎక్కడా వ్యతిరేక వార్తా కథనాలు రావడం లేదు. కానీ సోషల్‌ మీడియాలో మాత్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెరిగాయి.

ఇన్నాళ్లు కాంగ్రెస్‌కు చెందిన వారు మాత్రమే ప్రభుత్వంపై విమర్శలు చేసేవారు. అయితే ఆతర్వాత బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత కాషాయ దళం యాక్టివ్ అయింది. వీళ్ళు కూడా ప్రభుత్వానికి వ్యతిరేక పోస్టులు పెంచారు.

మరోవైపు ఇదే సమయంలో గులాబీ దళం సోషల్‌ మీడియా సైలెంట్ అయింది. పెద్దగా వాళ్ల పోస్టులు కనిపించడం లేదు. మునపటి కౌంటర్ ఎటాకింగ్‌ లేదు. కేటీఆర్‌ కోటరీలో ఉండేవారు…. వారి శిష్యులు మాత్రం ఏదో ఒకటి అరా పోస్టులు పెడుతున్నారు. కౌంటర్‌ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో సోషల్‌ మీడియా హీట్‌ పెంచుతోంది. అధికార పార్టీపై ముప్పేట దాడి నడుస్తోంది. మరీ రాబోయే రోజుల్లో ఈ దాడిని గులాబీ దళం ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.

First Published:  26 July 2020 3:47 AM GMT
Next Story