Telugu Global
Cinema & Entertainment

కరోనా వ్యాక్సిన్ కోసం వకీల్ సాబ్ వెయిటింగ్

వకీల్ సాబ్ ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందా.. తన అభిమాన హీరో రీఎంట్రీని వెండితెరపై ఎప్పుడు చూద్దామా అని పవన్ ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే వాళ్ల ఎదురుచూపులకు ఇప్పట్లో తెరపడేలా లేదు. ఎందుకంటే కరోనా వచ్చి షూటింగ్ ఆగిపోయింది. అయినప్పటికీ తెగించి షూట్ స్టార్ట్ చేస్తారని కొందరు భావించారు. అలాంటి వాళ్ల ఆశలపై నీళ్లుచల్లాడు పవన్ కల్యాణ్. వ్యాక్సిన్ వస్తే తప్ప షూటింగ్ కు వచ్చేది లేదని తేల్చిచెప్పాడు. “కరోనా వల్ల అన్నీ ఆగిపోయాయి. […]

కరోనా వ్యాక్సిన్ కోసం వకీల్ సాబ్ వెయిటింగ్
X

వకీల్ సాబ్ ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందా.. తన అభిమాన హీరో రీఎంట్రీని వెండితెరపై ఎప్పుడు చూద్దామా అని పవన్ ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే వాళ్ల ఎదురుచూపులకు ఇప్పట్లో తెరపడేలా లేదు. ఎందుకంటే కరోనా వచ్చి షూటింగ్ ఆగిపోయింది. అయినప్పటికీ తెగించి షూట్ స్టార్ట్ చేస్తారని కొందరు భావించారు. అలాంటి వాళ్ల ఆశలపై నీళ్లుచల్లాడు పవన్ కల్యాణ్. వ్యాక్సిన్ వస్తే తప్ప షూటింగ్ కు వచ్చేది లేదని తేల్చిచెప్పాడు.

“కరోనా వల్ల అన్నీ ఆగిపోయాయి. అవి ఎప్పుడు మొదలవుతాయో తెలియదు. సామాజిక దూరం పాటించాలి. తొందరపడి షూటింగులు చేసుకున్నా కష్టమే. ఆ మధ్యన కొంతమంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారిని కలిశారు. అనుమతులు ఇచ్చినప్పటికీ షూటింగ్ చేసే పరిస్థితులు లేవు. ఎవరికైనా కరోనా సోకితే.. ఉదాహరణకు మొన్న అమితాబచ్చన్ కే వచ్చింది. ముఖ్య నటులకు వచ్చినా.. ఎవరికి వచ్చినా.. ఇబ్బందే. వ్యాక్సిన్ వచ్చే వరకు ఒక నిస్సహాయతతో అంతా వెయిట్ చేస్తూ ఉండాల్సిందే.”

ఇలా వకీల్ సాబ్ కు సంబంధించి పూర్తి స్పష్టత ఇచ్చాడు పవన్. కేవలం వకీల్ సాబ్ మాత్రమే కాదు.. క్రిష్ దర్శకత్వంలో కూడా ఓ సినిమాను ఆయన సెట్స్ పై ఉంచాడు. అది కూడా మళ్లీ పట్టాలపైకి ఇప్పట్లో రాదు. ఈ రెండు సినిమాల ప్రభావం.. ఆ తర్వాత రాబోతున్న హరీష్ శంకర్ మూవీపై కూడా పడింది.

First Published:  25 July 2020 10:30 PM GMT
Next Story