Telugu Global
National

3.0లో థియేటర్లకు గ్రీన్‌ సిగ్నల్‌ ?

ఇప్పటికే అన్‌లాక్‌ ప్రక్రియలో భాగంగా పలు రంగాలు పని చేసుకునే వీలు కల్పించిన కేంద్రం ఇప్పుడు సినిమా థియేటర్లకు అవకాశం ఇచ్చేందుకు సిద్దమవుతోంది. ఈ నెలాఖరుతో అన్‌లాక్‌ 2.0 ముగిసిపోతోంది. అన్‌లాక్‌ 3.0లో సినిమా థియేటర్లకు అవకాశం ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది. జిమ్‌లకు కూడా అవకాశం ఇవ్వనున్నారు. ఇందు కోసం మార్గదర్శకాలను కేంద్రం తయారు చేస్తోంది. అవకాశం ఇస్తే 50 శాతం సీటింగ్‌తో థియేటర్లు నడుపుతామని థియేటర్ల యాజమాన్యాలు ఇప్పటికే ప్రభుత్వానికి తెలియజేశాయి. కేంద్రం మాత్రం 25 […]

3.0లో థియేటర్లకు గ్రీన్‌ సిగ్నల్‌ ?
X

ఇప్పటికే అన్‌లాక్‌ ప్రక్రియలో భాగంగా పలు రంగాలు పని చేసుకునే వీలు కల్పించిన కేంద్రం ఇప్పుడు సినిమా థియేటర్లకు అవకాశం ఇచ్చేందుకు సిద్దమవుతోంది. ఈ నెలాఖరుతో అన్‌లాక్‌ 2.0 ముగిసిపోతోంది. అన్‌లాక్‌ 3.0లో సినిమా థియేటర్లకు అవకాశం ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది. జిమ్‌లకు కూడా అవకాశం ఇవ్వనున్నారు. ఇందు కోసం మార్గదర్శకాలను కేంద్రం తయారు చేస్తోంది.

అవకాశం ఇస్తే 50 శాతం సీటింగ్‌తో థియేటర్లు నడుపుతామని థియేటర్ల యాజమాన్యాలు ఇప్పటికే ప్రభుత్వానికి తెలియజేశాయి. కేంద్రం మాత్రం 25 శాతం సీటింగ్ సామర్థ్యంలో థియేటర్లు తెరిచేందుకు అనుమతి ఇవ్వాలని భావిస్తోంది. సినిమా థియేటర్లకు అవకాశం ఇచ్చే విషయంలో భిన్న వాదనలు కూడా ఉన్నాయి.

థియేటర్ లో గాలి అక్కడికక్కడే తిరుగుతూ ఉంటుందని… కాబట్టి ఒక్క కరోనా వ్యక్తి ఉన్నా మిగిలిన వారికి సులువుగా సోకే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. పైగా గంటల తరబడి థియేటర్ లో అంత మంది కూర్చోవడం వైరస్‌ వ్యాప్తికి మరింత సులువు అవుతుందని భావిస్తున్నారు. మెట్రో రైళ్లు, స్కూళ్లకు మాత్రం అన్‌లాక్‌ 3.0లో అవకాశం ఇచ్చే పరిస్థితి లేదని కేంద్ర వర్గాలు చెబుతున్నాయి.

First Published:  26 July 2020 9:41 PM GMT
Next Story