Telugu Global
National

తిండి కూడా దొరకదు... ప్రజలను వణికిస్తున్న చంద్రబాబు

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పక్క రాష్ట్రం తెలంగాణలోని తన బంగ్లాలో సురక్షితంగా ఉన్నారు. అక్కడి నుంచే ఆయన జూమ్‌ ద్వారా ఆన్‌లైన్లో ప్రసంగాలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రజలకు ధైర్యం చెప్పాల్సిందిపోయి వారిని భయపెట్టేలా ఆయన మాట్లాడుతున్న విధానం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇటీవల డాక్టర్లతో జూమ్ ద్వారా మీటింగ్ నిర్వహించిన చంద్రబాబు… ఏపీలో ప్రతి 10 సెకన్లకు ఒకరు చనిపోతున్నారంటూ చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు. ఈ లెక్క దేశ గణాంకాలతోనూ సరిపోవడం లేదు. అలాంటిది ఒక్క […]

తిండి కూడా దొరకదు... ప్రజలను వణికిస్తున్న చంద్రబాబు
X

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పక్క రాష్ట్రం తెలంగాణలోని తన బంగ్లాలో సురక్షితంగా ఉన్నారు. అక్కడి నుంచే ఆయన జూమ్‌ ద్వారా ఆన్‌లైన్లో ప్రసంగాలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రజలకు ధైర్యం చెప్పాల్సిందిపోయి వారిని భయపెట్టేలా ఆయన మాట్లాడుతున్న విధానం ఆశ్చర్యం కలిగిస్తోంది.

ఇటీవల డాక్టర్లతో జూమ్ ద్వారా మీటింగ్ నిర్వహించిన చంద్రబాబు… ఏపీలో ప్రతి 10 సెకన్లకు ఒకరు చనిపోతున్నారంటూ చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు. ఈ లెక్క దేశ గణాంకాలతోనూ సరిపోవడం లేదు. అలాంటిది ఒక్క ఏపీలోనే అంత మంది చనిపోతున్నారని చంద్రబాబు చెప్పడంతో అందరూ కంగుతిన్నారు.

తాజాగా మరోసారి ప్రజల్లో వణుకు పుట్టే ప్రకటన చేశారు చంద్రబాబు. కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ దెబ్బతిని తిండి కూడా దొరకని పరిస్థితి వస్తుందని జోస్యం చెప్పారు. ఆర్థికంగా ప్రపంచమే చితికిపోతోందన్నారు. కరోనా కేసుల విషయంలో దేశం మూడో స్థానంలో ఉందన్నారు. ఏపీలో ఎక్కువ మంది చనిపోతున్నారని ఆరోపించారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఉందన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలపై విమర్శలు మొదలయ్యాయి.

సాధారణంగా విపత్తులు వచ్చినప్పుడు ఆహారం దొరకదు అంటూ పుకార్లు రేపి… ప్రజల్లో ఆందోళన రేపి అవసరానికి మించి ఆహారపదార్దాలు నిల్వ చేసుకునేలా చేసి ఒక సంక్షోభం సృష్టించి ప్రభుత్వాలను దెబ్బతీయాలనే వారు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటారని పలువురు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు కూడా అదే తరహా ఆలోచనతో ఉన్నట్టుగా ఉన్నారని అనుమానిస్తున్నారు.

First Published:  28 July 2020 3:50 AM GMT
Next Story