వెబ్ సైట్ పై బిగ్ బాస్ బ్యూటీ ఫైర్

తనపై తప్పుడు కథనాలు ఇస్తే లీగర్ లా చర్యలు తీసుకుంటానని ఓవైపు హీరోయిన్ శ్రద్ధాదాస్ వెబ్ సైట్స్ కు వార్నింగ్ ఇచ్చింది. ఇప్పుడు ఇదే దిశగా మరో బ్యూటీ హెచ్చరికలు చేసింది. ఈమె బిగ్ బాస్ బ్యూటీ పునర్నవి. అవును.. పునర్నవి కూడా ఓ వెబ్ సైట్ పై ఫైర్ అయింది.

ఓ వెబ్ సైట్ పునర్నవి చేస్తున్న ఎక్సర్ సైజ్ వీడియో నుంచి కొన్ని స్టిల్స్ కట్ చేసి ఆర్టికల్ ఇచ్చింది. అందులో తప్పులేదు. పునర్నవి ఏం చేస్తోందో చెప్పడం తప్పు కాదు. కానీ ఆ కథనాలకు సెక్సీ హెడ్డింగ్స్ పెట్టింది. ఏదేదో రాసుకొచ్చింది.

ఇవన్నీ పునర్నవి కంట పడ్డాయి. దీంతో సదరు వెబ్ సైట్ పై పునర్నవి ఫైర్ అయింది. తన అనుమతి లేకుండా ఇలాంటి పనులు ఎలా చేస్తారని ప్రశ్నించింది. అమ్మాయిల్ని అందంగా చూపించడంలో తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ ఇష్టమొచ్చినట్టు రాసేస్తే మాత్రం ఊరుకోనని హెచ్చరించింది. వెంటనే తనకు సంబంధించిన కథనాన్ని డిలీట్ చేయాలని, లేదంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటానని ఓపెన్ గా హెచ్చరించింది ఈ బ్యూటీ.