మరోసారి ఆమె కాళ్లపై పడ్డారు…

హీరోయిన్ పూజా హెగ్డే ఇప్పుడు కాళ్లకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఆమె లెగ్స్ కు ఇప్పుడు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే కేవలం ఆడియన్స్ లోనే ఫ్యాన్స్ ఉన్నారని అనుకున్నాం. కానీ దర్శకులు కూడా ఆమె కాళ్లకు ఫిదా అయ్యారనే విషయం ఇప్పుడిప్పుడే అర్థమౌతోంది.

మొన్నటికిమొన్న దర్శకుడు త్రివిక్రమ్.. తన సినిమాలో చాలా భాగాన్ని పూజా హెగ్డే కాళ్ల చుట్టూనే తిప్పాడు. అల వైకుంఠపురములో సినిమాలో పూజా హెగ్డే కాళ్లకు ప్రత్యేకంగా ఓ ఎపిసోడ్ కేటాయించాడు. అంతేకాదు.. ఏకంగా ఆమె కాళ్లపై పాట కూడా పెట్టేశాడు. ఇప్పుడీ లిస్ట్ లోకి బొమ్మరిల్లు భాస్కర్ కూడా చేరిపోయాడనిపిస్తోంది.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాకు సంబంధించి తాజాగా మరో స్టిల్ రిలీజ్ చేశారు. ఈ స్టిల్ లో అఖిల్ కూడా ఉన్నాడు. కానీ పూజా హెగ్డే కాళ్లు మాత్రమే ఎక్కువగా హైలైట్ అయ్యాయి. అందరి కళ్లు ఆమె కాళ్లపైనే పడ్డాయి.

అల వైకుంఠపురములో సినిమాకు పూజా హెగ్డే లెగ్స్ సెంటిమెంట్ గా మారాయనే వాళ్లు ఉన్నారు. బహుశా అదే సెంటిమెంట్ ను ఈ సినిమాకు కూడా కొనసాగిస్తున్నారేమో. నిజంగా ఈ సెంటిమెంట్ వర్కవుట్ అయితే అఖిల్ కు తొలి హిట్ దక్కినట్టే.