Telugu Global
National

వీర్రాజు రాకతో వైసీపీ శ్రేణుల్లో ఆనందం ఎందుకు?

ఏపీలో బీజేపీ అధ్యక్షుడి మార్పుతో ఆ పార్టీలో పెద్దగా సందడి కనిపించలేదు, మొహమాటంకోసం ఒకరిద్దరు కొత్త అధ్యక్షుడికి శుభాకాంక్షలు చెప్పారు కానీ, కన్నా వెళ్లిపోయినందుకే ఓ వర్గం బాధపడింది. మిత్రపక్షం బీజేపీలో కూడా ఎలాంటి స్పందనా లేదు. ఓ ప్రెస్ నోట్ విడుదల చేసి చేతులు దులుపుకున్నారు పవన్ కల్యాణ్. అయితే అనూహ్యంగా వైసీపీ సోషల్ మీడియా మాత్రం పండగ చేసుకుంది. వీర్రాజు వచ్చారని కాదు కానీ, కన్నా వెళ్లిపోయినందుకు వైసీపీ సోషల్ మీడియా వింగ్ విపరీతమైన […]

వీర్రాజు రాకతో వైసీపీ శ్రేణుల్లో ఆనందం ఎందుకు?
X

ఏపీలో బీజేపీ అధ్యక్షుడి మార్పుతో ఆ పార్టీలో పెద్దగా సందడి కనిపించలేదు, మొహమాటంకోసం ఒకరిద్దరు కొత్త అధ్యక్షుడికి శుభాకాంక్షలు చెప్పారు కానీ, కన్నా వెళ్లిపోయినందుకే ఓ వర్గం బాధపడింది. మిత్రపక్షం బీజేపీలో కూడా ఎలాంటి స్పందనా లేదు. ఓ ప్రెస్ నోట్ విడుదల చేసి చేతులు దులుపుకున్నారు పవన్ కల్యాణ్.

అయితే అనూహ్యంగా వైసీపీ సోషల్ మీడియా మాత్రం పండగ చేసుకుంది. వీర్రాజు వచ్చారని కాదు కానీ, కన్నా వెళ్లిపోయినందుకు వైసీపీ సోషల్ మీడియా వింగ్ విపరీతమైన నెగెటివ్ పోస్టింగ్ లు పెట్టింది. కన్నాపై సెటైర్లు వేసింది. ఇక కన్నా ఫొటో కూడా వేయడానికి ఇష్టపడని సాక్షి పేపర్ కూడా వీర్రాజు ఇంటర్వ్యూ ఇచ్చిందంటే బీజేపీ కుర్చీలాట వైసీపీకి ఎంత ఆనందాన్నిచ్చిందో అర్థం చేసుకోవచ్చు.

కన్నా లక్ష్మీనారాయణ పూర్తిగా టీడీపీ తొత్తుగా మారడం, టీడీపీ తప్పిదాలను ఎప్పుడూ ఎత్తిచూపకపోవడం, అధికారపక్షంపై పదే పదే విమర్శలు గుప్పించడమే దీనికి కారణం. చంద్రబాబు ఏం చెబుతారో ఆ మరుసటి రోజే కన్నా లక్ష్మీనారాయణ దాన్ని వల్లెవేస్తారు. రాజధాని మార్పు అయినా, ఇతర సమస్యలయినా కన్నా టార్గెట్ ఎప్పుడూ జగన్, వైసీపీనే. అదే సమయంలో పవన్ కల్యాణ్ కూడా బీజేపీ చెప్పినట్టల్లా ఆడాల్సి వచ్చింది.

ఈ సందర్భంలో బీజేపీ అధిష్టానం కన్నాని పక్కన పెట్టడం వైసీపీకి సంతోషాన్నిచ్చింది. వీర్రాజు కానీ, వీర్రాజు స్థానంలో ఇంకెవరొచ్చినా వైసీపీకి ఒరిగేదేమీ ఉండదు, తరిగేదీ ఉండదు. కన్నాలాంటి నాయకుడు వెళ్లిపోవడమే వారికి కావాల్సింది. అది జరిగింది కాబట్టే వైసీపీలో తెలియని కదలిక వచ్చింది. అందులోనూ వీర్రాజు రాగానే వైసీపీ, టీడీపీకి సమదూరం అన్నారు, టీడీపీ ఓటుబ్యాంకుకే తాము గండికొడతామని స్టేట్ మెంట్ ఇచ్చారు. అంటే రాబోయే రోజుల్లో బీజేపీ బలపడితే అదే స్థాయిలో టీడీపీ బలహీనపడటం ఖాయమని అర్థమవుతోంది.

ఇక వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఆధిక్యం తగ్గే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదే జరిగి వైసీపీ సపోర్ట్ కూడా బీజేపీకి అవసరం కావొచ్చు. అందుకే జగన్ తో రాష్ట్రంలో శతృత్వం లేకుండా ఉండేందుకు అధిష్టానం కన్నాని తొలగించి వీర్రాజుని నియమించినట్టు తెలుస్తోంది. ఒకరకంగా ఏపీలో టీడీపీని భూస్థాపితం చేసేందుకు వైసీపీ, బీజేపీ ఉమ్మడిగా ప్రయత్నిస్తున్నాయనమాట.

First Published:  29 July 2020 10:04 AM GMT
Next Story