డైరక్టర్ పేరు చెప్పకుండా సినిమా రిలీజ్

హిందీలో సూపర్ హిట్టయిన “క్వీన్” సినిమాకు సౌత్ లో రీమేక్ లు జరిగాయి. మను కుమారన్ అనే నిర్మాత రైట్స్ తీసుకొని.. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ వెర్షన్లలో ఈ సినిమాను రీమేక్ చేశారు. ఒక్కో లాంగ్వేజ్ లో ఒక్కో హీరోయిన్ ను తీసుకున్నారు.

ఇప్పుడీ సినిమాలన్నింటినీ ఒకేసారి ఓటీటీలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. రెండు పెద్ద ఓటీటీ సంస్థలతో చర్చలు జరుపుతున్నారు. అంతా బాగానే ఉంది కానీ తెలుగు వెర్షన్ కు సంబంధించి దర్శకుడి పేరు దగ్గర సమస్య వచ్చింది.

తెలుగు వెర్షన్ కు నీలకంఠ దర్శకత్వం వహించాడు. అయితే దాదాపు 60శాతం షూటింగ్ పూర్తయిన తర్వాత అతడ్ని తప్పించారు. అతడి స్థానంలో ప్రశాంత్ వర్మను తీసుకున్నారు. నీలకంఠకు ఎలాంటి పరిహారం ఇవ్వలేదని తెలుస్తోంది. ఒకవేళ ప్రశాంత్ వర్మ పేరును టైటిల్ కార్డ్ తో వేస్తే.. నీలకంఠ నుంచి లీగల్ సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. అలా అని నీలకంఠ పేరు కూడా వేయడానికి మేకర్స్ కు ఇష్టం లేదు. దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.