షాకింగ్… రాజమౌళికి కరోనా

దర్శకధీరుడు రాజమౌళికి కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆ దర్శకుడు స్వయంగా ప్రకటించాడు. తనతో పాటు తన కుటుంబ సభ్యులందరికీ కరోనా లక్షణాలున్నట్టు తెలిపాడు. ప్రస్తుతం తామంతా హోమ్ క్వారంటైన్ లో ఉన్నట్టు ప్రకటించాడు ఈ డైరక్టర్.

కొన్ని రోజుల కిందట రాజమౌళితో పాటు అతడి కుటుంబ సభ్యులందరికీ స్వల్పంగా జ్వరం వచ్చి తగ్గిందట. దేనికైనా మంచిదని అంతా టెస్టులు చేయించుకుంటే, అందులో కరోనా లక్షణాలు బయటపడ్డాయి. దీంతో కుటుంబ సభ్యులంతా హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు.

తమకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని ప్రకటించాడు రాజమౌళి. అయినప్పటికీ అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నామని, వైద్యుల సూచనల మేరకు నడుచుకుంటున్నామని ట్వీట్ చేశాడు. తమ శరీరంలో యాంటీబాడీస్ (రోగనిరోధక శక్తి) పెరిగిన తర్వాత, ప్లాస్మా దానం చేస్తామని కూడా ప్రకటించాడు ఈ దర్శకుడు.