ఈసారి బిగ్ బాస్ లో అది లేనట్టే

బిగ్ బాస్ సీజన్-4కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. సీజన్-4 టైటిల్ తో బిగ్ బాస్ లోగోతో స్టార్ మా ఛానెల్ లో కర్టెన్ రైజర్ కూడా పడింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఆగస్ట్ నెలాఖరు నుంచి బిగ్ బాస్ హౌజ్ తలుపులు తెరుస్తారు. ఇదిలా ఉండగా, ఈసారి బిగ్ బాస్ షోకు సంబంధించి ఓ కీలక నిర్ణయం తీసుకుందట యాజమాన్యం.

ఈసారి సీజన్-4లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉండవని తెలుస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. బిగ్ బాస్ షో కు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తాయి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు. ఇందులో భాగంగా గతంలో హాట్ హాట్ అందాల్ని హౌజ్ లోకి ప్రవేశపెట్టింది ఛానెల్. ఈసారి ఆ ముచ్చట ఉండదనిపిస్తోంది.

ఎంపికైన సభ్యులందరికీ విధిగా కరోనా పరీక్షలు చేయించి, నెగెటివ్ వచ్చిన తర్వాత ఆ సర్టిఫికెట్లను తమ దగ్గరే ఉంచుకొని అప్పుడు హౌజ్ లోకి పంపిస్తుంది స్టార్ మా యాజమాన్యం. హౌజ్ లో ఉన్న కంటెస్టెంట్లతోనే క్లైమాక్స్ వరకు నడిపిస్తుంది. ప్రస్తుతానికి ఇదే ప్లాన్.