Telugu Global
NEWS

మద్యంపై నీ ఏడుపేంటి బాబూ..?

“అయ్యయ్యో మద్యం షాపులు తెరిచారు, కరోనా లాక్ డౌన్ కష్టకాలంలో ప్రభుత్వం మద్యం అమ్ముకుని సొమ్ము చేసుకుంటోంది” అంటూ నిన్నటిదాకా తీవ్రంగా విమర్శించారు చంద్రబాబు. ఆ నాలుక ఈరోజు మడతపడింది. ప్రకాశం జిల్లాలో శానిటైజర్ తాగి 9మంది మృతి చెందిన ఘటనను ఆసరాగా చేసుకుని మరోసారి శవరాజకీయానికి తెరతీశారు చంద్రబాబు. మద్యం అమ్మకాలతో కరోనా వ్యాప్తి పెరుగుతోందని, వెంటనే మద్యం షాపులు మూసేయాలని చాన్నాళ్లుగా డిమాండ్ చేస్తున్నారు చంద్రబాబు. మద్యం షాపుల ముందు కిక్కిరిసిన క్యూలైన్లలో కిక్కుకోసం […]

మద్యంపై నీ ఏడుపేంటి బాబూ..?
X

“అయ్యయ్యో మద్యం షాపులు తెరిచారు, కరోనా లాక్ డౌన్ కష్టకాలంలో ప్రభుత్వం మద్యం అమ్ముకుని సొమ్ము చేసుకుంటోంది” అంటూ నిన్నటిదాకా తీవ్రంగా విమర్శించారు చంద్రబాబు. ఆ నాలుక ఈరోజు మడతపడింది.

ప్రకాశం జిల్లాలో శానిటైజర్ తాగి 9మంది మృతి చెందిన ఘటనను ఆసరాగా చేసుకుని మరోసారి శవరాజకీయానికి తెరతీశారు చంద్రబాబు. మద్యం అమ్మకాలతో కరోనా వ్యాప్తి పెరుగుతోందని, వెంటనే మద్యం షాపులు మూసేయాలని చాన్నాళ్లుగా డిమాండ్ చేస్తున్నారు చంద్రబాబు.

మద్యం షాపుల ముందు కిక్కిరిసిన క్యూలైన్లలో కిక్కుకోసం వెళ్లిన జనాలు ప్రీగా వైరస్ ని కొని తెచ్చుకుంటున్నారని తెగ సెటైర్లు వేశారు. అదే చంద్రబాబు ఇప్పుడు మద్యం అందుబాటులో లేకపోవడం వల్లే ప్రకాశం జిల్లాలో శానిటైజర్లు తాగి 9మంది చనిపోయారని చెప్పడం ఎంత నీఛం. కరోనా వస్తుంది మద్యం షాపులు మూసేయండన్న నోటితోనే ఇప్పుడు “షాపులు మూసేస్తే జనం శానిటైజర్లు తాగి చనిపోయారు, దీనికి ప్రభుత్వానిదే బాధ్యత” అంటూ రెచ్చిపోయారు.

ఇంతకీ చంద్రబాబుకి కావాల్సిందేంటి? లాక్ డౌన్ లో మద్యం దుకాణాలు తెరవాలా, లేక వద్దా? ఏదో ఒక విషయాన్ని ఆయన స్పష్టంగా చెబితే బాగుండేది. నలభయ్యేళ్ల రాజకీయ అనుభవం ఉన్న బాబు, మద్యంపై ఆమాత్రం ప్రభుత్వానికి ఉచిత సలహా పారేయలేరా? చెప్పలేక కాదు, తన స్టాండ్ ఇదీ అని చెబితే ఇలా అవకాశం దొరికినప్పుడల్లా నాలుక మడతేయడం కుదరదు కదా.

అందుకే నిన్నటి వరకూ మద్యం అమ్మొద్దు అన్న చంద్రబాబే, నేడు మద్యం ఎందుకు అందుబాటులో లేదంటూ నిలదీస్తున్నారు. మధ్యలో ఈ బ్రాండ్ల గోల ఒకటి. రేట్లు పెంచి, ఆకర్షణీయమైన లేబుళ్లు తగ్గించి, బ్రాండ్లు అందుబాటులో లేకుండా చేస్తే మద్యపానం వైపు యువత దృష్టిసారించదనే ఉద్దేశంతోటే జగన్ కఠిన నిర్ణయాన్ని తీసుకున్నారు. దాదాపుగా ఆ నిర్ణయంతో మద్యపానం చేసేవారి సంఖ్య గణనీయంగా తగ్గిందని గణాంకాలే చెబుతున్నాయి. మరి చంద్రబాబుకి వచ్చిన నష్టమేంటి? మద్యానికి బానిస అయిన వ్యక్తి అదిలేనప్పుడు శానిటైజర్ అయినా, ఇంకేది అందుబాటులో ఉన్నా ఓ గుటక వేస్తాడు.

అలాంటి మానసిక స్థితిలోనే మద్యం అందుబాటులో లేక కురిచేడులో శానిటైజర్లు తాగి కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. వాస్తవానికి ఈ ఘటనపై లోతైన విచారణ జరిపి బాధ్యులను శిక్షించాలని కోరాలి కానీ, బాధ్యతాయుతమైన ప్రతిపక్షం అని చెప్పుకునే బాబు, మద్యం అందుబాటులో ఉంటే మరణాలు తగ్గేవని చెప్పడం నిజంగా సిగ్గుచేటు.

First Published:  31 July 2020 8:03 AM GMT
Next Story