శౌర్య సరసన రొమాంటిక్ హీరోయిన్

నాగశౌర్య చేతిలో 3-4 సినిమాలున్నాయి. అతడు ఎప్పుడు ఏ సినిమాకు కాల్షీట్ ఇస్తాడో కూడా అర్థంకాని పరిస్థితి. మరీ ముఖ్యంగా లాక్ డౌన్ తో షూటింగ్స్ అన్నీ ఆగిపోవడంతో నాగశౌర్య నెక్ట్స్ మూవీ ఏంటనేది చెప్పడం కష్టంగా మారింది. ఇలాంటి టైమ్ లో మరో సినిమాకు కాల్షీట్లు కేటాయించాడు శౌర్య.

ఆగస్ట్ నుంచి సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు శౌర్య. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో రాబోతున్న ఈ సినిమాలో శౌర్య.. ఆర్చర్ గా కనిపించబోతున్నాడు. దీనికి సంబంధించి తాజాగా ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. దాదాపు బయోపిక్ టైపులో ఉండే ఈ సినిమాలో శౌర్య సరసన హీరోయిన్ గా కేతిక శర్మను తీసుకున్నారు.

ప్రస్తుతం “రొమాంటిక్” అనే సినిమా చేస్తోంది కేతిక. పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ ఇందులో హీరో. ఈ మూవీ ఇంకా రిలీజ్ అవ్వకముందే శౌర్య సినిమాలో ఛాన్స్ పట్టేసింది కేతిక.

శరత్ మరార్, నారాయణ్ దాస్ నారంగ్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు ఇంకా మ్యూజిక్ డైరక్టర్ ను ఫైనలైజ్ చేయలేదు. ఈ మూవీ కోసం సిక్స్ ప్యాక్ సాధించాడు శౌర్య