బాలయ్యతో కామెడీ సాధ్యమేనా!

లాక్ డౌన్ వల్ల ప్రస్తుతం బాలయ్య ఖాళీ. ఆయనకు సంబంధించిన సినిమా పనులేవీ జరగడం లేదు. బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ తో సినిమాలు పూర్తిచేసే బాలయ్యకు ఈ గ్యాప్ ఇబ్బందికరంగా మారింది. అందుకే ఈ గ్యాప్ లో ఆయన మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే పనిలో పడ్డారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే అనీల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య ఓ సినిమా చేసే ఛాన్స్ ఉంది.

రీసెంట్ గా అనీల్-బాలయ్య మధ్య స్టోరీ డిస్కషన్స్ జరిగాయి. బాలయ్య ఈ సినిమాకు దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే అని తెలుస్తోంది. దిల్ రాజు ఈ ప్రాజెక్టుకు నిర్మాతగా వ్యవహరించబోతున్నాడు.

అంతా బాగానే ఉంది కానీ కామెడీకి కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన అనీల్ రావిపూడి, బాలయ్యతో ఎలా కామెడీ పండిస్తాడనేది ఇప్పుడు మనసులో ఉన్న ప్రశ్న. తన కెరీర్ లో బాలకృష్ణ ఎన్నో సినిమాలు చేసి ఉండొచ్చు. కానీ కామెడీ విషయంలో బాలయ్య చాలా వీక్ అనే విమర్శ ఉండనే ఉంది. ఫుల్ లెంగ్త్ లో బాలయ్య కామెడీ పండించిన సినిమాలేవీ లేవు. కనీసం అతడి సినిమాల్లో కామెడీ బాగా పండిన ఎపిసోడ్స్ కూడా కనిపించవు. అలాంటి బాలయ్యతో అనీల్ రావిపూడి తన మార్క్ కామెడీ ఎలా పండిస్తాడో చూడాలి.