చంద్రబాబు అవే డ్రామాలు… బీటెక్ రవి‌ రాజీనామా నాటకం !

ఏపీ పరిపాలన వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్‌ ఆమోదముద్ర వేశారు. సీఆర్ డీఏ బిల్లును రద్దుచేశారు. రెండు బిల్లులపై సంతకాలు చేశారు. అంతే ఇక తెలుగుదేశానికి ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది.

225 రోజులకు పైగా అమరావతి డ్రామా ఆడుతున్నారు. కథ క్లైమాక్స్‌కు చేరింది. ఇంకా ఆడేందుకు ఏమీ లేదు. రేపోమాపో కోర్టుల్లో కూడా తేలిపోనుంది. అయితే ప్రజలను నమ్మించేందుకు అస్త్రాలు లేకుండా పోయాయి. చంద్రబాబు ఏదైనా చేసి రాజధాని తరలిపోకుండా ఆపుతారని ఓ వర్గం నమ్మింది. కానీ చంద్రబాబు వయసు అయిపోయింది. ఆయన వ్యూహాలు పనిచేయకుండా పోయాయి. ఆయన అవుడేటేడ్‌ పొలిటిషయన్‌ అనిపించుకుంటున్నాడు.

1995లో నేర్చుకున్న విద్యలే ఇంకా చంద్రబాబు ప్రయోగిస్తున్నాడు. విండోస్‌ 10 వెర్షన్‌కు వచ్చింది. కానీ చంద్రబాబు 95 వెర్షన్‌లోనే ఉండిపోయాడు. ఇందుకు ఉదాహరణ బీటెక్‌ రవి రాజీనామా డ్రామానే.

రాజధాని బిల్లులు ఆమోదం పొందిన వెంటనే తెలుగుదేశం దగ్గర ఎదుర్కొనే ప్లాన్‌లేదు. దీంతో రాజీనామా డ్రామాకు తెరలేపారు. ఎమ్మెల్సీ బీటెక్ రవితో రాజీనామా నాటకం మొదలుపెట్టారు. ఎవరైనా రాజీనామా చేస్తే శాసనమండలి ఛైర్మన్‌కు సరైన ఫార్మాట్‌లో ఇవ్వాలి. ఏక వాక్యంలో మాత్రమే ఉండాలి. కానీ ఇక్కడ ఈయన రాజీనామా లేఖ చంద్రబాబుకు పంపారు. అదేకాదు. ఒకవేళ మండలి చైర్మన్‌కు ఇచ్చినా… ఆయన తెలుగుదేశం వారే. ఈ సోషల్‌మీడియా కాలంలో ఇవన్నీ గమనించరని చంద్రబాబు అనుకున్నట్లు ఉన్నారు, కానీ బీటెక్‌ రాజీనామా డ్రామా మొదట్లోనే తేలిపోయింది.

అమరావతి రాజధాని కావాలంటే తనకు ఉన్న 20 మంది ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించాలని చంద్రబాబుకు వైసీపీ నేతలు సవాల్‌ విసురుతున్నారు. తెలంగాణ టైమ్‌లో కూడా ఇలాంటి అవుడేటేడ్‌ నాటకాలు ఆడి…చంద్రబాబు అంటే చులకన అయిపోయాడు. ఇప్పుడు మళ్లీ అదే రూట్లో చంద్రబాబు వెళుతున్నట్లు కనిపిస్తోంది. బాబు గారూ కొంచెం స్క్రిప్ట్‌ మార్చండి… అప్డేట్ అవ్వండని సొంతపార్టీ నేతలే కోరుతున్నారు.