గోపీచంద్ సినిమా ఈ నెలలోనే

కరోనా కారణంగా టాలీవుడ్ లో స్తబ్దత ఏర్పడింది. హీరోలెవ్వరూ సెట్స్ పైకి రావడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. దీంతో ఓ మోస్తరు బడ్జెట్ నుంచి భారీ బడ్జెట్ సినిమాల వరకు అన్నీ ఆగిపోయాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా హీరో గోపీచంద్ వెనక్కి తగ్గడం లేదు. తనకు సంబంధించి 2 సినిమాల్ని సెట్స్ పైకి తీసుకురావాలని నిర్ణయించాడు.

లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన సినిమాల్లో ఒకటి సీటీమార్. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఈ నెలలోనే సెట్స్ పైకి తీసుకురావాలని గోపీచంద్ నిర్ణయించాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే మరో 2 వారాల్లో ఈ సినిమా కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది.

ఈ మూవీ కంప్లీట్ అయిన వెంటనే తేజ దర్శకత్వంలో చేయాల్సిన సినిమాను సెట్స్ పైకి తీసుకురావాలని నిర్ణయించాడు గోపీచంద్. ఈ సినిమాను డిసెంబర్ నుంచి మొదలుపెట్టాలని నిర్ణయించారు. వైరస్ వ్యాప్తి ఉన్నప్పటికీ డిసెంబర్ నుంచి మూవీ స్టార్ట్ చేయాలని గోపీచంద్-తేజ నిర్ణయానికొచ్చారు.

ఇలా కరోనా పరిస్థితుల్ని లెక్కచేయకుండా సెట్స్ పైకి రావాలని నిర్ణయించుకున్నాడు ఈ హీరో.