40ఏళ్లుగా ఇళయరాజా ఫ్రీగా వాడుకున్నారు… ఇక చాలు – సాయి ప్రసాద్

సంగీత దర్శకుడు ఇళయరాజా, ప్రసాద్ స్టూడియోస్ అధినేత ఎల్వీ ప్రసాద్ మనవడు సాయి ప్రసాద్‌ మధ్య వివాదం పోలీసు స్టేషన్‌కు ఎక్కింది. ఎల్వీ సాయి ప్రసాద్‌పై ఇళయరాజా పోలీసులకు ఫిర్యాదు చేశారు. చెన్నై పోలీసు కమిషనర్‌ను కలిసి సాయి ప్రసాద్‌ పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు. సాయి ప్రసాద్‌, ఆయన అనుచరులు ఎల్వీ ప్రసాద్ స్డూడియోస్‌లోని తన చాంబర్‌లోకి చొరబడి వస్తువులను ధ్వంసం చేశారని ఫిర్యాదులో వివరించారు.

40ఏళ్ల క్రితం ఎల్వీ ప్రసాద్ తన స్టూడియోలోని కొంత భాగాన్ని ఇళయరాజాకు కేటాయించారు. అప్పటి నుంచి ఇళయరాజా అక్కడే సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల ఎల్వీ ప్రసాద్ మనవడు సాయిప్రసాద్‌ … సదరు గదిని ఖాళీ చేయాల్సిందిగా ఇళయరాజాకు సూచించారు. అందుకు ఇళయరాజా అంగీకరించలేదు.

ఎల్వీ ప్రసాద్‌ తనకు ఈ గదిని గిప్ట్‌గా ఇచ్చారని… అది తన సొంతమని చెబుతున్నారు. సాయిప్రసాద్‌ మాత్రం .. గదిని శాశ్వతంగా కేటాయించలేదని… కేవలం తాత్కాలికంగా ఇళయరాజాకు ఇచ్చారని చెబుతున్నారు. 40ఏళ్ల పాటు ఫ్రీగా వాడుకున్నారని… ఇక చాలు అంటున్నారు.

తన తాత శాశ్వతంగా ఇచ్చి ఉంటే అందుకు సంబంధించిన ఆధారాలను గానీ, డాక్యుమెంట్లుగానీ చూపించాలని సాయిప్రసాద్‌ డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇళయరాజా పోలీసులకు ఫిర్యాదు చేశారు.